బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లో ఉండాలని, టైటిల్ గెలవాలని గేమ్ ఆడుతున్నారు కానీ విష్ణు ప్రియ మాత్రం పృథ్వి కోసమే హౌస్ లోకి వచ్చినట్లు కనిపిస్తుంది, కనిపించటమే కాదు పబ్లిక్ గా పృధ్వి కోసమే ఉంటాను, పృథ్వి కోసమే ఆడతాను, తనకంటే నాకు ఏది ఎక్కువ కాదు అని చెప్తుంది. గత 11 వారాల్లో ఈమె ఒక్క టాస్క్ గాని ఒక్క ఎంటర్టైన్మెంట్ గాని, పదిమందితో కలిసి మాట్లాడటం కానీ చేసింది లేదు.
అయినా ఇప్పటికీ ఆమె హౌస్ లోనే ఉండటం విశేషం. ఇప్పటివరకు ఆమె హౌస్ లో ఉండటానికి కారణం విష్ణు ప్రియ జెన్యూన్ అంటూ ఆమెకి ఓట్లు వేసే ఓవర్గం ఆడియన్స్ అనే చెప్పాలి. ఆమె స్వార్థం లేకుండా ఆడుతుందని ఆమెకి ఓట్లు వేస్తున్నారు. నాగార్జున తీరు కూడా విష్ణుప్రియ కి ఫేవర్ గానే కనిపిస్తుంది. అందుకే విష్ణు ప్రియ ఇంకా హౌస్ లో కొనసాగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఆమె ఆటలో గెలవాలని టైటిల్ కొట్టాలని ఆశిస్తున్న ఆమె స్నేహితులు మాత్రం ఆమె పద్ధతిని తప్పుపడుతున్నారు. పృధ్వి కోసం కాకుండా తనకోసం ఆడమని సలహా ఇస్తున్నారు. నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో విష్ణు ప్రియ తరఫున వచ్చిన యాంకర్ రవి, విష్ణు ప్రియ చెల్లెలు కూడా ఇదే విషయాన్ని విష్ణు ప్రియకి అర్థమయ్యేలా చెప్పారు. గేమ్ ఇంకా నాలుగు వారాలే ఉంది ఇప్పటికైనా నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తావా లేదంటే నీకు నువ్వే ప్రయారిటీ ఇచ్చుకోకుండా తిరుగుతావా అని యాంకర్ రవి డైరెక్ట్ గానే అడిగాడు.
అయితే విష్ణు ప్రియ నా కోసం నేను వాడితే స్వార్థం అవుతుంది, నాకు అందరూ ఇంపార్టెంట్ అని సమాధానం చెప్పడంతో తిక్కరేగిన రవి నీకే నువ్వు ప్రయారిటీ ఇచ్చుకోకపోతే నీకు ఓట్లే ఎవరేస్తారంటూ గట్టిగానే చెప్పాడు. విష్ణు ప్రియ చెల్లెలు కూడా నీ మీద కాన్సన్ట్రేట్ చెయ్యు, సో కాల్డ్ పీ మీద కాదు అంటూ వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పింది.మరి విష్ణు ప్రియ ఆ సలహా పాటిస్తుందో లేదంటే ఎప్పటిలాగే పృద్వియే ముఖ్యం అని తన ఓటమి తానే కొని తెచ్చుకుంటుందో వేచి చూడాలి.