Nagachaitanya -Sobhita: ఆగిపోయిన నాగచైతన్య శోభిత వివాహం… అదే కారణమా?

Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత వివాహానికి సమయం ఆసన్నమవుతున్న సంగతి మనకు తెలిసిందే. సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య తిరిగి శోభితను ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ పెళ్లి మాత్రం ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే వీరు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి.

నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన తేదీన ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయిన ఇండస్ట్రీ సమాచారం ప్రకారం వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు సమక్షంలో జరగబోతుందని వార్తలు వినిపించాయి. ఇక అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇలా డిసెంబర్ 4వ తేదీ వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వీరు పెళ్లి వాయిదా పడిందని తెలుస్తోంది.

డిసెంబర్ 4వ తేదీ జరగాల్సిన వీరి వివాహం వాయిదా పడిందని సమాచారం అసలు వీరి పెళ్లి వాయిదా పడటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన వెంటనే వేణు స్వామి వీరి జాతకం గురించి ఒక వీడియో విడుదల చేశారు ఒక స్త్రీ కారణంగా వీరిద్దరూ పెళ్లైన మూడు సంవత్సరాలకి విడిపోతారని తెలిపారు. ఇలా నాగచైతన్య శోభిత జాతకం గురించి ఇలాంటి వార్తలు వచ్చిన తరుణంలో నాగార్జున పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సమంతను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న తన కొడుకుకి మరోసారి కూడా అలాగే జరిగితే తట్టుకోలేరని భావించిన నాగార్జున తన కొడుకు పెళ్లి విషయంలో ఏ విధమైనటువంటి తొందర లేకుండా జాతకంలో దోషాలు తొలగిపోవడం కోసం ప్రత్యేకంగా పూజలు హోమాలు చేయించారని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జాతకంలో దోషాల కోసం పూర్తిస్థాయిలో పరిహారం చేయించిన తర్వాతనే నాగచైతన్య శోభిత పెళ్లి జరిగేలా చూడటం కోసమే ప్రస్తుతం వీరి పెళ్లిని వాయిదా వేసారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.