Keerthy Suresh: టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కీర్తి సురేష్ అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇకపోతే గతంలో చాలాసార్లు కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చాలా సార్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తూ వచ్చింది. మొన్నటికి మొన్న ఆమె మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత దుబాయికి చెందిన ఒక వ్యాపారితో పెళ్లి ఖాయం అయ్యిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వీటిపై కీర్తి సురేష్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. పైగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సున్నితంగా తిరస్కరించింది. కాగా తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన చిరకాల మిత్రుడితో కీర్తి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు జోరుగా వినిపీస్తున్నాయి.
ఇరుకుటుంబాల అంగీకాంతో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోందని, గోవా బీచ్లో పెళ్లి వేదికను ఫిక్స్ చేశారని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. తాజాగా సౌత్ మీడియాలో కూడా ఈ వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే దీనిపై కీర్తి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వార్తలపై కీర్తి సురేష్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.