Health Tips: బూడిద గుమ్మడి కాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ముఖ్యంగా వేసవి కాలంలో..!

Health Tips: సాధారణంగా బూడిద గుమ్మడి కాయలను మనదేశంలోఇంటికి దిష్టి తగలకుండా వేలాడకడతారు.సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో బూడిద గుమ్మడికాయ తో చేసిన ఎన్నో రకాల వంటకాలు దర్శనమిస్తాయి. మనదేశంలో బూడిద గుమ్మడి కాయలను ఎక్కువగా వంటల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. ఇటువంటి బూడిదగుమ్మడి కాయలు వ్యాధులు కూడా ఉపయోగపడతాయి. బూడిద గుమ్మడి కాయల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బూడిద గుమ్మడికాయ, వాటి ఆకులు, విత్తనాల లో కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. బూడిదగుమ్మడి కాయలో బి కాంప్లెక్స్, విటమిన్ సి, నియాసిన్, థయామిన్ అనే విటమిన్లు ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. బూడిదగుమ్మడి కాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

కేంద్ర కాలంలో మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక కప్పు బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు నియంత్రించవచ్చు. అధిక బరువుతో బాధపడే వారు కూడా ప్రతి రోజు ఈ జ్యూస్ తాగడం వల్ల శరీర బరువు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి ఈ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ బిపి ఈ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగడం వల్ల వారి సమస్య అదుపులో ఉంటుంది. అంతేకాకుండా కాళ్ల నొప్పులు, కాళ్లు లాగటం, కాళ్లు వాపులు రావటం వంటి సమస్యలు కూడా ఈ జ్యూస్ తాగడం వల్ల నియంత్రించవచ్చు. బూడిద గుమ్మడికాయ విత్తనాల నుండి తీసిన నూనెను చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడానికి వినియోగిస్తారు .