Mass Star Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్, యువ ప్రొడక్షన్స్ కొత్త చిత్రం గ్రాండ్ గా లాంచ్

Mass Star Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా మెహర్ యరమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది.

ముహూర్తపు సన్నివేశానికి ఎస్కేఎన్ క్లాప్ కొట్టారు. వంశీ నందిపాటి కెమరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి కృష్ణ దాస్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ సదాశివుని మ్యూజిక్. వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్.

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత యువకృష్ణ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ మెహర్ నా స్నేహితుడు. సినిమా కోసం చాలా కథలు విన్నాను. అయితే మెహర్ ఈ కథ చెప్పిన వెంటనే నచ్చింది. అద్భుతమైన స్క్రిప్టు. నటనకి చాలా మంచి స్కోప్ ఉన్న కథ, ఈ కథ వినగానే మొదట నాకు బాబీ సింహ గారే గుర్తొచ్చారు. ఆయన్ని సంప్రదిస్తే అప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నారు. కథ ఆయనకు చాలా నచ్చింది. వెంటనే చేద్దామని ఆయన చెప్పడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నిర్మాతగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, కథకు కావలసింది ప్రతిదీ సమకూర్చి ఒక అద్భుతమైన సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం.

దర్శకుడు మెహర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా దర్శకుడిగా ఇది నా తొలి సినిమా. మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను. మా టీమ్ అందరికీ థాంక్యూ.

సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బాబి గారితో ఫస్ట్ టైం కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాను. హెబ్బా పటేల్ గారితో కలిసి మరోసారి నటించడం ఆనందంగా ఉంది. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్టు. మీ అందరిని అలరిస్తుంది

నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. బాబీ సింహా ప్రసిద్ధమైన నటుడు. చాలా అద్భుతమైన పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు హీరోగా వస్తున్నారు. సూర్య శ్రీనివాస్ తో కలిసి ఆల్రెడీ బ్రో సినిమా చేశాను. మెహర్ చాలా అద్భుతమైన కంటెంట్తో ఈ సినిమా తీసుకొస్తున్నాడు. ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించి దర్శకుడు నిర్మాత సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. బాబీ సింహాకి ఇది చాలా చాలెంజింగ్ క్యారెక్టర్. హీరోగా కూడా అతను నిరూపించుకుంటాడని భావిస్తున్నాను.

హెబ్బా పటేల్ మాట్లాడుతూ…. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నాకు మంచి ఎక్సైటింగ్ ప్రాజెక్టు వచ్చింది. సూర్యతో కలిసి పని చేయడం ఇది రెండోసారి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యు. బాబీ సింహ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.

హీరో బాబీ సింహ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. వాల్తేరు వీరయ్య తర్వాత మళ్లీ మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాను. ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో యువ దగ్గర నుంచి కాల్ వచ్చింది స్క్రిప్ట్ విన్న తర్వాత చాలా నచ్చింది. ఒక యాక్టర్ ని ఛాలెంజ్ చేసే స్క్రిప్ట్ ఇది. నా కెరియర్ లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో తాత గారి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్ భరిణి గారు చేస్తున్నారని తెలిసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. హెబ్బా ఎక్సలెంట్ పెర్ఫార్మర్. తనతో వర్క్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి టీం తో ఈ సినిమా చేస్తున్నాం. మా నిర్మాత యువ చాలా పాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఈ కథ విన్న తర్వాత ఛాలెంజింగ్ గా అనిపించింది. డిసెంబర్ 22 నుంచి వైజాగ్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాం.

తారాగణం: బాబీ సింహా, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్

నిర్మాత – యువ కృష్ణ
ప్రొడక్షన్ హౌస్ – యువ ప్రొడక్షన్స్
దర్శకత్వం – మెహర్ యరమతి
సినిమాటోగ్రాఫర్ – జి కృష్ణ దాస్
సంగీతం – సిద్ధార్థ సదాశివుని
ఆర్ట్ డైరెక్టర్ – వివేక్ అన్నామలై
రైటర్స్ – వంశీ కె, యశ్వంత్ సాన
Vfx – భాను
కాస్ట్యూమ్ డిజైనర్ – శ్రావ్య పెద్ది
పబ్లిసిటీ డిజైనర్లు – ధని ఏలే
పీఆర్వో- వంశీ శేఖర్

భ్రమరావతి || Journalist Bharadwaj Reveals Shocking Facts About Amaravati Scam || Chandrababu || TR