45 The Movie Trailer: కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటి వరకు ‘45 ది మూవీ’ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో భారీ అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అంతే కాకుండా కొత్త రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నట్టుగా తెలిపారు.
ఇక ‘45 ది మూవీ’ ట్రైలర్ చూస్తే మాత్రం కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా కనిపిస్తోంది. కొత్త రకమైన ఆయుధాలు, బాణాలతో దాడి, బుల్లెట్ల వర్షం, కొత్తగా క్రియేట్ చేసిన ద్విచక్ర వాహనం ఇలా అన్నీ డిఫరెంట్‌గానే కనిపిస్తున్నాయి. ఓ వైపు యుద్ద సన్నివేశాలు, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తూనే.. ప్రజెంట్ ట్రెండ్‌లోని సీన్లు కూడా చూపించారు. ఇక ఇందులో శివన్న లుక్స్, అప్పియరెన్స్ అదిరిపోయాయి. ఇక ఉపేంద్ర యాక్షన్, డైలాగ్ డెలివరీ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. రాజ్ బి శెట్టి, మొట్టా రాజేంద్రన్ కాంబో అదిరిపోయేలా ఉంది.
‘45 ది మూవీ’ ట్రైలర్‌లోని చివరి షాట్, అందులో శివన్న గెటప్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్‌లోని విజువల్స్, ఆర్ఆర్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ఓ విజువల్ వండర్‌గా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ‘45 ది మూవీ’ జనవరి 1న తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది.
ఈ సినిమాకు డాక్టర్ కె రవి వర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ చేతన్ డిసౌజా వంటి వారు పోరాట సన్నివేశాల్ని కంపోజ్ చేశారు. అనిల్ కుమార్ మాటల్ని అందించగా.. ఈ మూవీకి సత్య హెగ్డే కెమెరామెన్‌గా, కె.ఎం. ప్రకాష్ ఎడిటర్‌గా పని చేశారు.
నటీనటులు : శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి తదితరులు
సాంకేతిక బృందం
నిర్మాణ సంస్థ: సూరజ్ ప్రొడక్షన్
నిర్మాత: శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి
కథ, సంగీతం, దర్శకత్వం: అర్జున్ జన్య
సినిమాటోగ్రాఫర్ : సత్య హెగ్డే
ఎడిటర్ : కె. ఎం ప్రకాష్
స్టంట్స్ : డాక్టర్ కె రవి వర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ చేతన్ డిసౌజా
డైలాగ్స్ : అనిల్ కుమార్
పీఆర్వో : సాయి సతీష్

