కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు, ఎస్ఎస్‌సి ప్రొడక్షన్ నెం 3 టైటిల్ ‘విష్ణు విన్యాసం’- 2026 ఫిబ్రవరిలో రిలీజ్

Vishnu Vinyasam: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు యూనిక్ అండ్ ఎక్సయిటింగ్ సబ్జెక్ట్స్ చేస్తూ ప్రతి సినిమాతో ప్రేక్షలకు అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో యూనిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తారు. హేమ & షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు. ఈ రోజు సినిమా టీం ఒక యానిమేషన్ వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.

స్టైలిష్ యానిమేటెడ్ వీడియో ద్వారా టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని కూడా ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. అర్బన్ సెటప్‌లో సాగే ఈ గ్లింప్స్‌లో, కస్టమ్ యెల్లో మోటార్‌సైకిల్‌పై నగర వీధుల్లో దూసుకెళ్తున్న శ్రీ విష్ణు మొదటి ఫ్రేమ్ నుంచే అలరించారు. ఈ సినిమాకు ‘విష్ణు విన్యాసం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది శ్రీ విష్ణు ఎసెంట్రిక్ స్క్రీన్ పర్సోనాకు అద్దం పట్టేలా ఉంది. ఆయన ట్రేడ్‌మార్క్ హ్యూమర్‌ను హైలైట్ చేస్తూ, టైటిల్ రివీల్‌కు “No Brakes – Just Laughs” అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌ మరింత అలరించింది. “చరిత్ర, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం అన్నీ అతని కోసమే కనుగొనబడ్డాయి” అంటూ వినిపించే ప్లేఫుల్ వాయిస్‌ఓవర్‌ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. రధన్ అందించిన స్కోర్ కూడా ఈ మొత్తం టైటిల్ వీడియోకి హ్యూమర్‌ను మరింత ఎలివేట్ చేసింది.

ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటిస్తుండగా, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా, రాధన్ సంగీత దర్శకుడిగా, ఎ. రమణంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. కార్తికేయన్ రోహిణి ఎడిటర్.

ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలిఉంది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరిలో థియేట్రికల్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ టైటిల్ గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేశారు.

తారాగణం: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
ప్రొడక్షన్ హౌస్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత: సుమంత్ నాయుడు జి
ప్రెజెంట్స్: హేమ & షాలిని జి
సహ నిర్మాతలు: సాయికృష్ణ బొబ్బా & రామాచారి ఎం
DOP: సాయి శ్రీరామ్
సంగీతం: రధన్
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రఫీ: భాను మాస్టర్
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ-శేఖర్

Bhavanipuram Victims Fire On Chandrababu | Ap Public Talk | Ys Jagan Meets Bhavanipuram Victims | TR