మరోసారి తెలుగు రాష్ట్రాలని ముంచెత్తనున్న వర్షం-వాతావరణ శాఖ హెచ్చరిక

Rain in AP and Telangana

ఈ సంవత్సరం వానాకాలం లో దేశమంతటా వర్షాలు భారీగా కురవటం వల్లన అనేక రాష్ట్రాల ప్రజలు దారుణంగా నష్టపోతున్నారు. వేసవి కాలంలో ఎండకి భయపడని ప్రజలని కరోనా భయపెట్టింది. ఇంకా కరోనా ముప్పు నుండి బయటపడని ప్రజలను ఈ వర్షాలు దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి ఆగకుండా కురుస్తున్న వర్షాలకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇబ్బందిపడుతూ ఉంటే, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. విషయం లోకి వెలితే….

Rain in AP and Telangana
Rain in AP and Telangana

తెలంగాణ: రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల వలన వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉంది. చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్, పడిపోవడం వలన సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి పొంగి పోవటం వలన లోతట్టు ప్రాంతాలలో, చిన్న బ్రిడ్జిలు, కాజ్‌వేలలో నీరు ప్రవహించే అవకాశం ఉంది. ట్రాఫిక్ అంతరాయలతో ప్రజలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాల యంత్రంగం మొత్తం అప్రమత్తంగా ఉండి ఇంతకు ముందు జారీ చేసిన వరద ప్రోటోకాల్ తప్పని సరిగా ఫాలో కావాలని జిల్లా కలెక్టర్లను కోరినట్లు తెలంగాణ ప్రభుత్వ సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్నిరోజుల నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయి.నేడు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
నేడు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.నేడు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
అందువల్ల ప్రజలందరని జాగ్రత్తగా ఉండాలని మరియు రాష్ట్ర యంత్రాంగాన్నిఅప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వారు కోరుతున్నారు.