ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ శాఖలలో 250 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 250 ఉద్యోగ ఖాళీలలో ఆంధ్రప్రదేశ్‌లో 19, తెలంగాణలో 30 ఖాళీలు ఉండగా ఎంపికైన వాళ్లకు 12 నెలల పాటు శిక్షణ ఉండనుందని సమాచారం అందుతోంది.

ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ శిక్షణకు అర్హత కలిగి ఉంటారు. 2023 సంవత్సరం డిసెంబర్ 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 9000 రూపాయల నుంచి 15000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

జనరల్ కేటగిరీ, ఓబీసీలకు 944 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు 708 రూపాయలు, దివ్యంగ అభ్యర్థులకు 472 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా అర్హత, ఆసక్తి ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తం వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు చేకూరుతోంది.