తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రూ.50,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఫిబ్రవరి నెల 2వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి నెల 2వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. 7వ తరగతి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు అన్ని అర్హతలు ఉన్నవాళ్లు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 65 కంటే ఎక్కువ జాబ్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననుండగా 5000కు పైగా జాబ్స్ కోసం ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఉద్యోగం లేని వాళ్లకు ఈ జాబ్ మేళా వరం అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు లభించనుందని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీల కోసం హాజరైన ప్రతి ఒక్కరూ జాబ్ సాధించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీల గురించి ఆసక్తి ఉన్నవాళ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది.

రెజ్యూమ్, సర్టిఫికెట్ల జిరాక్స్ లు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు ఈ జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది. 8886111981, 9030047304 నంబర్ల ద్వారా ఈ ఇంటర్వ్యూలకు సంబంధించి మరిన్ని ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నంబర్ల ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.