నాని హిట్ కొట్టబోతున్నాడు..”శ్యామ్ సింగ రాయ్” అదిరిపోయింది.!

Nani Going To Hit With His Shyam Singha Roy | Telugu Rajyam

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “శ్యామ్ సింగ రాయ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే నాని గత రెండు సినిమాలు ఓటిటి లో రిలీజ్ కాగా ఇది మాత్రం థియేటర్స్ లో వచ్చే నెల రిలీజ్ కానుంది. మరి ఇదిలా ఉండగా టాక్సీ వాలా ఫేమ్ దర్శకుడు రాహుల్ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి ఇప్పుడు విడుదల అయ్యిన టీజర్ అదిరిపోయింది అని చెప్పాలి.

వెస్ట్ బెంగాల్ గడ్డ పై తెలుగు వాడు శ్యామ్ సింగ రాయ్ అన్యాయానికి ఎలాంటి పోరాటం చేసాడు అలాగే మరో జన్మలో ఇంకో నాని కూడా కనిపిస్తున్నాడు. ఆసక్తికర డైలాగ్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇంకా ఇందులో మిక్కీ జె మేయర్ సంగీతం కూడా ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. మొత్తంగా అయితే మాత్రం నాని మళ్ళీ సాలిడ్ హిట్ అందులోని అదిరే కంటెంట్ తో ఇవ్వబోతున్నాడు అని క్లియర్ అయ్యిపోతుంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే వచ్చే డిసెంబర్ 24 వరకు ఆగాల్సిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles