Sai Pallavi: టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాయి పల్లవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం ట్రెడిషనల్ నేచురల్ పాత్రలలో మాత్రమే నటిస్తూ నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆ ఫిదా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా బయట కూడా చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇటీవీల కాలంలో సాయి పల్లవి తరచూ ఏదోక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరోసారి సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. అందుకు గల కారణం కొద్దిరోజులుగా సాయిపల్లవికి సంబంధించి వరుణ్ అవుతున్న ఫొటోస్. ఇటీవల కొద్ది రోజుల క్రితం తన చెల్లితో కలిసి బీచ్ కు వెళ్లిన సాయి పల్లవి అక్కడ తీసుకున్న ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి.
అందులో ఆమె బికినీలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. సాయి పల్లవి తీరుపై నెటిజన్స్ సైతం ఫైర్ అయ్యారు. కానీ కొందరు అభిమానులు మాత్రం ఆమెకు అండగా నిలబడ్డారు. ఆ ఫోటోస్ నిజం కాదు, ఏఐతో జనరేట్ చేసినవి అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ఫోటోస్ పై తాజాగా సాయి పల్లవి స్పందిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. కాగా తన చెల్లితో కలిసి ట్రిప్ కు వెళ్లిన సాయి పల్లవి అందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ షేర్ చేసింది. పైన కనిపిస్తున్న ఫోటోస్ నిజమైనవే. ఏఐ చిత్రాలు కాదు అని రాసుకొచ్చింది. దీంతో తాను బికినీ వేసుకున్నట్లు వస్తున్న ఫోటోస్ పై ఇన్ డైరెక్ట్ గా ఇచ్చిపడేసింది. దీంతో సాయి పల్లవికి మరోసారి మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
