కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలా?

ఈరోజుల్లో షుగర్ రావడానికి వయసుతో సంబంధం లేదు. అప్పుడే పుట్టిన బిడ్టకు కూడా షుగర్ ఉన్న పరిస్థితులు చూశాం. ఇందుకు మారిన మనిషి రోజారీ జీవనమే కారణం. ఆహారం, నిద్ర, వ్యాయామం, పని ఒత్తిడి.. ఇవన్నీ షుగర్ కు దారి తీస్తున్నాయి. షుగర్ ను నిర్లక్ష్యం చేస్తే హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు వైద్యులు. దీని నుంచి తప్పించుకోవాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవాలి. మన శరీరంలో మంచి కొలస్ట్రాల్స్, చెడు కొలస్ట్రాల్స్ కూడా ఉంటాయి.

మంచి కొలస్ట్రాల్ ను పెంచుకోవడం ముఖ్యం. దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మంచి కొలస్టాల్ పెంచుకోవాలంటే క్రమం తప్పకుండా ఎక్స్ర్సైజుల చేయాలి. చెడు కొలస్ట్రాల్ ద్వారా వచ్చే ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆల్కహాల్ మానేయాలి. రెడ్ మీట్, మేక, పొట్టేలు మాంసం తినడం తగ్గించుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువుగా ఉండేలి. ఆహారంలో ఫైబర్ ఎక్కువుగా ఉండాలి. జీర్ణక్రియకు ఇది అత్యంత అవసరం అని వైద్య నిపుణులు అంటున్నారు.

ఇలా తీసుకునే ఆహారంలో మార్పులు, మంచి పోషకాలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకొవచ్చు. షుగుర్ ఉన్న వారికి బీపీ, కొలస్ట్రాల్ ఖచ్చితంగా అదుపులో ఉండాలి. లేదంటే ఒక్కోసారి ప్రాణ హాని కూడా ఏర్పడుతుంది. ఇలా.. ఆహారం, అలవాట్లు, వ్యాయామం, పోషకాలు, నిద్ర, ఒత్తిడి.. వీటన్నింటినీ అదుపు చేయగలిగితే గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ వంటి సమస్యలను దూరం చేయొచ్చని వైద్యులు అంటున్నారు.

 

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణులు, వైద్యులు పలు సందర్భాల్లో తెలిపిన వివరాలను మాత్రమే అందించాం. మీ ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ వివరాలు అర్హత ఉన్న వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ వివారాలకు, మీ ఆరోగ్యానికి ‘తెలుగు రాజ్యం’ బాధ్యత వహించదు. గమనించగలరు.