రాత్రి సరిగ్గా నిద్రపట్టట్లేదా.. అయితే ఇలా చేయండి హాయిగా నిద్రపోతారు..!

రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే రోజంతా గజిబిజిగా మారుతుంది. ఉదయం ఎంతకీ లేవలేరు.. లేచినా అలసట, చిరాకు వెంటాడుతుంటాయి. రోజంతా ఏ పని మీదా దృష్టిపెట్టలేరు. ఒత్తిడిగా ఫీల్ అవుతారు. జ్ఞాపకశక్తి మసకబారుతుంది. ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగించగలరు.. కానీ ఇప్పుడు చాలన్నట్టు చెబుతోంది ఓ సహజ చిట్కా. మందులు తీసుకోకుండా, గ్యాడ్జెట్లు దూరంగా పెట్టకుండా.. ఇంట్లోనే ఉండే పదార్థాలతో నిద్ర సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

నిద్రలేమికి కారణాలు చాలా ఉన్నాయి. పని ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మానసిక అలసట, అలాగే అస్థిరమైన నిద్రపట్టే టైమింగ్స్‌ ఇవన్నీ నిద్రపైన ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక నొప్పులు, కీళ్ల సమస్యలు, ఆస్తమా, అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలూ నిద్రలేమికి దోహదం చేస్తుంటాయి. అంతేకాకుండా, రాత్రిళ్లు గ్యాడ్జెట్లలో ఎక్కువ సమయం గడపడం, సోషల్ మీడియా మీద డిపెండెంట్ అవడం వల్ల మెదడు రిలాక్స్ కాకపోవడం నిద్రకు అడ్డుగా మారుతోంది.

అయితే వీటికి పరిష్కారం కోసం మందులపై ఆధారపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఇంటి చిట్కాలు చాలు అంటున్నారు. ముందుగా 100 మి.లీ ఆర్గానిక్ పాలు తీసుకోవాలి. అందులో ఒక చెంచా దేశీ నెయ్యి, పావు చెంచా జాజికాయ పొడి, రెండు కుంకుమపువ్వు రెక్కలు, అర చెంచా చక్కెర, రెండు యాలకులు, పావు చెంచా గసగసాలు కలపాలి. వీటన్నింటినీ ఒక చిన్న గిన్నెలో వేసి బాగా మరిగించాలి. మిశ్రమం సగం పరిమాణానికి వచ్చే వరకు స్టౌ మీద ఉంచాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉండగా తాగాలి.

ఈ మిశ్రమాన్ని రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య తాగాలి. అలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే నిద్రపట్టేలా అవుతుంది. మానసికంగా రిలాక్స్ అవుతారు. శరీరం నిద్రకు సిద్ధమవుతుంది. దీనివల్ల స్లీప్ క్వాలిటీ మెరుగవుతుంది. పాలలోని ట్రిప్టోఫాన్, గసగసాల్లో ఉండే నాచురల్ సెడేటివ్ లక్షణాలు, యాలకులో ఉండే మైండ్ క్యాల్మింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిసొచ్చే ఈ మిశ్రమం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. నిద్రను చిన్న సమస్యగా తీసుకోకండి. నిద్రలేమి వల్ల శరీరంలోని హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయి. మెటబాలిజం మందగిస్తుంది. మానసిక స్థితి మారిపోతుంది. కాబట్టి, ఈ సింపుల్ చిట్కాను రోజు పాటించండి. తేడా మీరు మరిచిపోలేరు.