తెలుగు సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది కరోనా పాండమిక్ నేపథ్యంలో. ఇతర భాష్లోలనూ ఇందుకు భిన్నమైన పరిస్థితులేమీ లేవు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ ధరల విషయమై నడుస్తున్న పంచాయితీ, కొన్ని సినిమాలపై అధికార పార్టీ అక్కసు.. వెరసి, మొత్తంగా తెలుగు సినిమా పరిశ్రమ విలవిల్లాడుతోంది. కరోనా దెబ్బకి ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. మరి, ‘లవ్ స్టోరీ’ పరిస్థితి ఏమవుతుంది.. ఈ సినిమాతో వసూళ్ళ ప్రభంజనమేనని చిత్ర యూనిట్ భావిస్తోంది. ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ అవ్వాలని యావత్ తెలుగు సినీ పరిశ్రమ కోరుకుంటోంది. శేఖర్ కమ్ముల సినిమా, సాయి పల్లవి హీరోయిన్, నాగచైతన్య హీరో.. సినిమాపై భారీ అంచనాలు.. ఇవి చాలవా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడానికి.? మామూలుగా అయితే సరిపోతాయ్.
కానీ, ఇప్పుడు సీన్ అందుకు భిన్నం. ‘టక్ జగదీష్’ ఎందుకు భయపడ్డాడు థియేటర్లలోకి వచ్చేందుకు.? అది అందరికీ తెలిసిందే. అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు. ‘సీటీమార్’ సూపర్ హిట్ అన్నారు.. కానీ, చతికిలపడిపోయింది సినిమా. ప్రేక్షకుల్ని థియేటర్లకు భయం లేకుండా రప్పించడం అనేది అతి ముఖ్యమైన విషయమిక్కడ. కానీ, అంత సానుకూల పరిస్థితులైతే ఇప్పుడు లేవు. మరెలా.? ఏమో, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, వీరితోపాటుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘లవ్ స్టోరీ’ సినిమా కోసం తమవంతు సాయం, ప్రచారం పరంగా చేస్తున్న దరిమిలా, ఈ సినిమా థియేటర్లలో ఎంతవరకు ఆ పాజిటివ్ వైబ్స్‌ని కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే. కాదు కాదు, సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోలుకోవాల్సిందే.