ఇండియన్ మోస్ట్ పాపులర్ యాక్టర్ గా ప్రభాస్.. నెంబర్ వన్ యాక్ట్రెస్ ఎవరంటే?

అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీల జాబితాను ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈనెల తన సర్వే రిపోర్ట్ ని విడుదల చేసింది. ఇందులో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాలోనే మోస్ట్ పాపులర్ పర్సన్ గా ఫస్ట్ ప్లేస్ ని దక్కించుకున్నాడు. ఇలా ఫస్ట్ ప్లేస్ ని దక్కించుకోవడం ప్రభాస్ కి వరుసగా ఇది రెండవసారి.

నవంబర్ నెలకి ప్రకటించిన మోస్ట్ పాపులర్ స్టార్ జాబితాలో ప్రభాస్ మొదటి స్థానం సంపాదించగా తర్వాత స్థానంలో తమిళ నటుడు విజయ్ దళపతి నిలిచారు. తర్వాత వరుసగా అల్లు అర్జున్, షారుక్ ఖాన్,ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేష్ బాబు, సూర్య, రామ్ చరణ్, అక్షయ్ కుమార్ నిలిచారు. ఇక హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. సమంత కథానాయికల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉండడం వరుసగా ఇది మూడోసారి.

నిజానికి సమంత చాలా రోజులుగా సినిమాలకి దూరంగా ఉండి ఈ మధ్యనే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అభిమానులకి టచ్ లోనే ఉంటుంది సమంత. వరుసగా సినిమాలు చెయ్యకపోయినా, వెండి తెరపై కనిపించకపోయినా దేశం మొత్తం ఆమె గురించి మాట్లాడుకునేలా చేయడంలో సమంత ఎప్పుడూ ముందే ఉంటుంది.

ఇక సమంత తర్వాత స్థానంలో అలియా భట్, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకొనే, త్రిష, కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న, శ్రద్ధ కపూర్, కత్రినా కైఫ్ ఉన్నారు. ఇక ఈ లిస్ట్ ని ఎలా తయారు చేస్తారంటే స్టార్స్ జాబితాలో ఉన్న వారి ర్యాంకింగ్ ని బేస్ చేసుకుని దీన్ని రెడీ చేసినట్లు పేర్కొంది ఆ సంస్థ. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న 250 మిలియన్లకు పైగా విజిటర్ల పేజీ వ్యూస్ ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగ్స్ ని వెల్లడించినట్లు సదరు సంస్థ తెలిపింది.