కోలీవుడ్ నుంచి తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్న వారిలో లీడింగ్ లో ఉంటారు విజయ్ సేతుపతి, సాయిపల్లవి. సినిమా సినిమాకు తమ పర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేయడం ఈ స్టార్ యాక్టర్ల స్పెషాలిటీ. తాజాగా ఇద్దరు ఉత్తమ నటులుగా అవార్డులు అందుకుని వార్తల్లో నిలిచారు. 22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ డిసెంబర్ 19న ముగిసింది.
ఈవెంట్‌లో వివిధ కేటిగిరీల్లో అవార్డులను ప్రదానం చేశారు. సాయిపల్లవి ఇటీవలే ‘అమరన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు అందుకుంది. మరోపైపు విజయ్ సేతుపతి మహారాజ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. వీరితోపాటు పలు సినిమాలకు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి.
అవార్డ్ విజేతలు..
అమరన్ :
ఉత్తమ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
ఉత్తమ సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్ కుమార్
మహారాజ :
ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి
ఉత్తమ రచయిత: నిథిలన్ స్వామి నాథన్
ఉత్తమ సహాయ నటి: దుషారా విజయన్ (వెట్టైయాన్)
ఉత్తమ దర్శకుడు (స్పెషల్ జ్యూరీ అవార్డ్) : పా రంజిత్ (తంగలాన్)
ఫేవరేట్ యాక్టర్ అవార్డ్ : అరవింద్ స్వామి