జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే చేయాల్సిన.. చేయకూడని పనులివే!

ఆచార్య చాణిక్యుడు మానవ జీవితం ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే తన నీతి గ్రంధం ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలియజేశారు.మన జీవితం ముళ్ళబాటలో కాకుండా పూల బాటలో పయనించాలి అంటే ఆచార్య చాణిక్యుడు చెప్పిన సూత్రాలను కనుక పాటిస్తే మన జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడమే కాకుండా మనం అనుకున్న లక్ష్యాలను కూడా చేరుకుంటాము.అయితే ఆచార్య చానిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా ఒక మనిషి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఆ మనిషి చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి అనే విషయాలను కూడా వివరించారు.

చాణిక్యుడు చెప్పిన నీతి శాస్త్రం ప్రకారం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఎప్పుడు కూడా డబ్బు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయకూడదు. అలాగే అందం ఆహారం విషయంలో కూడా ఎప్పుడూ అసంతృప్తిగా ఉండకూడదు మనకు లభించిన దానిలోనే మనం తృప్తి చెందాలి. ఇలా తృప్తి పడినప్పుడే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి. ఇక చాణిక్య నీతి ప్రకారం జ్ఞానం లేని జీవితం ఎప్పుడూ అసంపూర్ణం అందుకే జ్ఞానం పెంపొందించుకోవడం ఎంతో అవసరం.

ఇక మనం ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆ నిర్ణయం వల్ల వచ్చే ఇబ్బందులు వచ్చే మంచి ఫలితాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఇక మనం ఎల్లప్పుడూ కూడా ఉన్నతంగా ఆలోచించే వ్యక్తులతోనే స్నేహం చేయాలి ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేసినప్పుడు మన ఆలోచన విధానం కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఇక వివాహమైనటువంటి పురుషులు ఎప్పుడూ కూడా మహిళల పట్ల ఆకర్షితులు కాకూడదు అలా ఆకర్షితులుగా ఉంటే వారి పని పై వారు దృష్టి సారించరు.ఇక చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కూడా ఇతరుల,తన తప్పుల నుంచి పాఠాలను నేర్చుకోవాలి ఇలా తప్పు నుంచి ఎవరైతే పాఠం నేర్చుకుంటారో అలాంటివారు వారి జీవితంలో ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలను చేరుకొని ఎంతో సంతోషంగా ఉంటారని వెల్లడించారు.