సుధీర్ వేరు వేరుగా షోస్ చేయటానికి గల కారణం గురించి లీక్ చేసిన హైపర్ ఆది..?

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైపర్ ఆది స్టేజ్ మీద ఉంటే చాలు అక్కడున్న వారితోపాటు ప్రేక్షకులందరూ కూడా పగలబడి నవ్వాల్సిందే. కో ఆర్టిస్టులు, జడ్జెస్ అన్న తేడా లేకుండా ఎవరి మీదైనా ఆది పంచులు వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటాడు. ఇక సుధీర్, రష్మీ జోడి గురించి ఆది వేసే పంచులకు లెక్కలేదు. అయితే ప్రస్తుతం ఆది, సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు జబర్దస్త్ కు దూరమయ్యారు. అయినా ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో ఆది సందడి చేస్తున్నప్పటికీ.. సుధీర్ మాత్రం మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో సందడి చేస్తున్నాడు. దీంతో ఇంతకాలం ఒకే ఛానల్లో ఒకే స్టేజి మీద కలిసి కనిపించే సుధీర్, రష్మీ ఇప్పుడు వేరువేరు చానల్స్ లో కనిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సుధీర్, రష్మి జంట మీద ఆది పంచ్ ల వర్షం కురిపించాడు. ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి హీరోయిన్ ఇషా చావ్లా గెస్ట్ గా వచ్చింది. ఈ క్రమంలో ఆది ఆమెని ప్రేమిస్తున్నానంటూ ఆమెకి 11 గిఫ్టులు ఇచ్చి.. గతంలో సుధీర్, రష్మీ చేసిన పనిని గుర్తు చేశాడు.గతంలో జరిగిన ఒక ఈవెంట్ లో రష్మి 9ఏళ్ళ తమ ప్రేమకి గుర్తుగా 9 గిఫ్ట్స్ ఇచ్చిన సంగతి గుర్తు చేస్తూ…సరిగ్గా మీ తొమ్మిదేళ్ల ప్రాసెస్ కరెక్టుగా జరిగుంటే మీకే ఎంగేజ్‌మెంట్, పెళ్లి అని 90 గిఫ్టులు వచ్చేవి’ అని ఆది అంటాడు. అప్పుడు రష్మీ మాట్లాడుతూ.. అయినా మేము ఇప్పుడు జనాలకు బోర్ కొట్టామా ఏంటి? అని అంటుంది.

అప్పుడు ఆది మాట్లాడుతూ.. బోర్ కొట్టారనే కదా ఇప్పుడు విడివిడిగా షోస్ చేస్తున్నారు అంటూ అసలు విషయం బయటపెట్టాడు. ఇక మరొక సందర్భంలో సుధీర్,రష్మి జంట గురించి ఆది మాట్లాడుతుండగా.. ఇమాన్యుల్ మాట్లాడుతూ అదేంటి సుధీర్ రష్మీ జంటని అలా అంటారు?వారి జోడికి దిష్టి తగిలింది అని అంటాడు. అప్పుడు ఆది మాట్లాడుతూ ఒక దిష్టి జోడి గురించి మరొక ముష్టి జోడి మాట్లాడుతుంది అంటూ వర్ష, ఇమాన్యుల్ పరువు తీస్తాడు. మొత్తానికి ఆది ఇలా సుధీర్, రష్మీ జంట ప్రేక్షకులకు బోర్ కొట్టారని చెప్పుకొచ్చాడు.