తెలంగాణ బడ్జెట్‌ లో హైలైట్స్ .. ఏ రంగానికి ఎంత ?

తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థికశాఖ మంత్రి హ‌రీష్ రావు ప్ర‌వేశ‌పెట్టారు. 2021-22 ఏడాదికి సంబంధించి రూ. 2,30,825.96 కోట్లలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వార్షిక బడ్జెట్‌లో అభివ‌ృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. తెలంగాణ బడ్జెట్‌లో ముఖ్యాంశాలను ఇక్కడ చూడండి.

రాష్ట్ర బ‌డ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు

రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు

ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు

పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు

రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లు

బడ్జెట్‌లో ముఖ్యాంశాలు:

వ్యవసాయ రంగానికి రూ.25 వేల కోట్లు

వైద్యారోగ్య శాఖ‌కు రూ. 6,295 కోట్లు

విద్యుత్ రంగానికి రూ. 11,046 కోట్లు

సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు

హోంశాఖ‌కు రూ. 6,465 కోట్లు

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రూ. 11 వేల కోట్లు

నూత‌న స‌చివాల‌యం నిర్మాణానికి రూ. 610 కోట్లు

ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 11,728 కోట్లు

క‌ల్యాణ‌ల‌క్ష్మి షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు

స‌మ‌గ్ర భూ స‌ర్వే కోసం రూ. 400 కోట్లు

పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ. 2,363 కోట్లు

సాంస్కృతిక ప‌ర్యాట‌క రంగాల‌కు రూ. 726 కోట్లు

ఐటీ రంగానికి రూ. 360 కోట్లు

మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు

బడ్జేతేర నిధులతో కలిపి ఆర్టీసీకి రూ. 3000 కోట్లు

అట‌వీశాఖ‌కు రూ. 1,276 కోట్లు

దేవాల‌యాల అభివృద్ధి, అర్చ‌కులు, దేవాదాయ ఉద్యోగుల సంక్షేమ కోసం రూ. 720 కోట్లు

ప‌శు సంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య‌శాఖ‌కు రూ. 1,730 కోట్లు

విద్యారంగం:

విద్యారంగ అభివృద్ధికి నూత‌న ప‌థ‌కం కోసం రూ. 4 వేల కోట్లు

పాఠ‌శాల విద్య‌కు రూ. 11,735 కోట్లు

ఉన్న‌త విద్యారంగానికి రూ. 1,873 కోట్లు

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం:

సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం రూ. 1000 కోట్లు

ఎస్సీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు

ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు

బీసీల సంక్షేమం:

నేత‌న్న‌ల సంక్ష‌మం కోసం రూ. 338 కోట్లు

బీసీ కార్పొరేష‌న్‌, అత్యంత వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కార్పొరేష‌న్‌కు రూ. 1000 కోట్లు

బీసీ సంక్షేమ శాఖ‌కు రూ. 5,522 కోట్లు

మైనార్టీ సంక్షేమం:

మైనార్టీ గురుకులాల నిర్వ‌హ‌ణ‌కు రూ. 561 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ. 1,606 కోట్లు

మ‌హిళా, శిశు సంక్షేమం

షీ టాయిలెట్ల‌కు రూ. 10 కోట్లు

మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల కోసం రూ. 3 వేల కోట్లు

మొత్తంగా మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,702 కోట్లు

ప‌ట్ట‌ణాల అభివృద్ధి:

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి రూ. 500 కోట్లు

ప‌ట్ట‌ణాల్లో వైకుంఠ‌ధామాల నిర్మాణానికి రూ. 200 కోట్లు

ప్రతి పట్టణంలో గజ్వేల్ తరహా మోడల్ మార్కెట్. సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల కోసం రూ. 500 కోట్లు

హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి:

ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం రూ. 250 కోట్లు

సుంకిశాల వ‌ద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు

మూసీ న‌ది పున‌రుజ్జీవం కోసం, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. 200 కోట్లు

ఓఆర్ఆర్ ప‌రిధిలోని కాల‌నీల తాగునీటి స‌ర‌ఫరా కోసం రూ. 250 కోట్లు

వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ. 250 కోట్లు

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ. 150 కోట్లు

మొత్తంగా పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధికి రూ. 15,030 కోట్లు

ప‌రిశ్ర‌మ‌ల‌ు:

ప‌రిశ్ర‌మ‌ల రాయితీ కోసం రూ. 2,500 కోట్లు

ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 3,077 కోట్లు

ర‌హ‌దారులు, భ‌వ‌నాల నిర్మాణం

ఆర్ అండ్ బీ రోడ్ల‌కు రూ. 800 కోట్లు

పంచాయ‌తీరాజ్ రోడ్ల‌కు రూ. 300 కోట్లు

స‌మీకృత క‌లెక్ట‌రేల్లు, జిల్లా పోలీసు కార్యాల‌యాలు, క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ల నిర్మాణానికి రూ. 725 కోట్లు

ఆర్వోబీ, ఆర్‌యూబీల‌కు రూ. 400 కోట్లు

మొత్తంగా రోడ్లు, భ‌వ‌నాల శాఖ‌కు రూ. 8,788 కోట్లు

ఇతరములు:

రీజిన‌ల్ రింగ్ రోడ్డు భూసేక‌ర‌ణ‌కు రూ. 750 కోట్లు

పౌర విమాన‌యాన అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు

తొలిసారిగా రాష్ర్ట ప్ర‌భుత్వ బ‌డ్జెట్ నుంచి మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 500 కోట్లు

ఇందులో జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 252 కోట్లు, మండ‌ల పరిష‌త్‌ల‌కు రూ. 248 కోట్లు

పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ. 29,271 కోట్లు

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల కోసం రూ. 5 కోట్లు