Pruthviraj: విశ్వక్ సేన్ కి బాగా పొగరు ఎక్కువ… అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి: పృథ్వీరాజ్

Pruthviraj: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఈయన వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈయన సినిమాలో పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోతున్నాయి అంతేకాకుండా ఈ సినిమాల ద్వారా విశ్వక్ కూడా వివాదాలలో నిలుస్తున్నారు.

ఇటీవల తన సినిమాలను విభిన్న రీతిలో ప్రమోట్ చేస్తూ ఈయన వివాదాలలో చిక్కుకున్నారు. రోడ్లపై పెట్రోల్ పోసుకోవడం న్యూస్ డిబేట్లో న్యూస్ రీడర్లతో కొట్లాట చేయడం వంటి వాటి ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు అయితే ఇటీవల లైలా సినిమా ప్రమోషన్లలో కూడా ఈ విధమైనటువంటి వివాదాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వైసిపి గురించి పరోక్షంగా కామెంట్లు చేయడంతో బాయ్కాట్ లైలా అంటూ ట్రెండ్ సెట్ చేశారు అయితే ఈ విషయం గురించి విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పారు. అయితే తాజాగా మరో నటుడు బబ్లు పృథ్వీరాజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ ఈయనని ప్రశ్నిస్తూ.. ఈతరం హీరోలలో బాగా ఆటిట్యూడ్ ఉన్న హీరో ఎవరు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు పృథ్వీరాజ్ సమాధానం చెబుతూ విశ్వక్సేన్ అంటూ టక్కున సమాధానం చెప్పారు. అతనికి కాస్త యాటిట్యూడ్ ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ యాటిట్యూడ్ కారణంగానే ఇటీవల లైలా లాంటి ఒక మంచి సినిమా అట్టర్ ప్లాఫ్ అయిందని తెలిపారు.

ఈ సినిమా రిలీజ్ సమయంలో ఒక అపార్థం నెలకొంది. అయితే ఈ విషయంలో సర్ది చెప్పుకోవాల్సిన సమయంలో ప్రెస్ అనేది చాలా బలమైనది. కానీ అలాంటి ప్రెస్ ని అవమానించేలా మాట్లాడారు. అలా ఓసారి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి వారికి సర్ది చెబుతాం అని పిలిచిన సమయంలో కూడా వారిపై నిప్పులు చెరిగారు. దీంతో వారు లైలా లాంటి మంచి సినిమా పైన నెగటివ్ ముద్ర వేయటంతో సినిమా ఫ్లాప్ అయిందని తెలిపారు. సినిమా కోసం ఒకసారి కాకపోతే వందసార్లు సారీ చెప్పడానికైనా వెనకాడకూడదు కానీ విశ్వక్ ఆటిట్యూడ్ అందుకు అడ్డొచ్చింది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.