Pravasti: సింగర్ ప్రవస్తి కులం ఏంటి… ఏకంగా గూగుల్ సెర్చ్ చేసిన నెటిజన్స్…ఇంత కుల పిచ్చి ఉందా?

Pravasti: సింగర్ ప్రవస్తి ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈమె పాడుతా తీయగా సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమంలో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. 20 24 పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచారు. అయితే ఇటీవల ఈమె ఈ కార్యక్రమం గురించి సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ వీడియోలో ఈమె మాట్లాడుతూ ఒకప్పుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు షో చాలా బాగుండేదని ఇప్పుడు అలా లేదని తెలిపారు. జడ్జిలుగా వ్యవహరిస్తున్నటువంటి కీరవాణి సునీత చంద్రబోస్ చాలా పక్షపాతం చూపిస్తారని తెలిపారు. ముఖ్యంగా సునీత గురించి కూడా సంచలన ఆరోపణలు చేశారు అలాగే ప్రొడక్షన్ టీం కాస్ట్యూమ్స్ గురించి కూడా ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఇలా పాడుతా తీయగా కార్యక్రమం గురించి ప్రవస్తి చేసిన వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది ఈమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ వివాదంలో మరి కొంతమంది ప్రవస్తి కులం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈమె ఏ కులానికి చెందిన వ్యక్తి అని తెలుసుకోవడం కోసం ఏకంగా గూగుల్ సెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. గత వారం రోజులుగా గూగుల్ సెర్చ్ కి సంబంధించిన డేటా విడుదల చేయడంతో అందులో ప్రవస్తి కులం గురించి కూడా సర్చ్ చేశారని వెల్లడి అయింది.

దాదాపు 75 మందికి పైగా ఈమె కులం గురించి సర్చ్ చేసినట్టు తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కుల పిచ్చి కాస్త ఎక్కువగానే ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఏదైనా ఒక వివాదం జరిగితే ముందు ఆ వ్యక్తి ఏ కులానికి చెందినవారు తెలుసుకొని కుల మతాల ఆధారంగా వివాదాన్ని రేకెత్తిస్తూ ఉంటారు దీంతో ప్రవస్తి కులం గురించి కూడా సర్చ్ చేశారని తెలియడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.