Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సినిమాగా నిలవడమే కాకుండా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇలా ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ దక్కింది అని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈ సినిమాని స్టార్ మా లో టెలికాస్ట్ చేశారు ఇలా టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన ఈ సినిమా దారుణమైన రేటింగ్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.పుష్ప 2కు బుల్లితెర మీద కేవలం 12.6 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. గతంలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో (29.4), పుష్ప ది రైజ్ (22.5) రేటింగ్స్ సాధించడంతో పుష్ప 2కు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందనే అందరూ భావించారు కానీ ఈ సినిమాకు మాత్రం బుల్లితెరపై కేవలం 12.6 టిఆర్పి రేటింగ్ రావడం గమనార్హం.
వెండితెరపై అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా బుల్లితెరపై సక్సెస్ కాకపోవడానికి కారణం లేకపోలేదు ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో దాదాపు ప్రేక్షకులందరు ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇలా థియేటర్లో పెద్ద ఎత్తున ఆదరణ రావడంతోనే బుల్లితెరపై ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడలేదని తెలుస్తుంది.
ఇక పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి అల్లు అర్జున్ పుష్ప తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం కావడంతో అట్లీ డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు.