Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా బాలనటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు అనంతరం రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తరువాత వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు . ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే మహేష్ బాబు సినిమాలలో సంపాదించిన డబ్బుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లను ఉచితంగా చేయిస్తూ వారికి పునర్జన్మ ఇస్తున్నారు.
నిజజీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్న మహేష్ బాబుకి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అయితే తాజాగా అభిమాని మహేష్ బాబు పట్ల తనకున్నటువంటి అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో బయటపెట్టారు.. కర్నూలుకు చెందిన ఓ అభిమాని తన పెళ్లి కావడంతో పెళ్లి ఆహ్వానం కోసం పెళ్లి పత్రికలను ముద్ర వేయించారు.
సాధారణంగా పెళ్లి పత్రికలపై దేవుళ్ళ ఫోటోలను వేస్తారు కానీ ఈ అభిమాని మాత్రం దేవుడి ఫోటోతో పాటు మహేష్ బాబు ఫోటోలు కూడా ముద్ర వేయించారు. ఇలా మహేష్ బాబు పై ఉన్న అభిమానంతోనే పెళ్లి పత్రికలపై తన ఫోటో వేయించారని తెలిసిన అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా ఈ ఫోటోలు మహేష్ బాబుకు చేరేవరకు షేర్ చేయాలి అంటూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.