Health Benifits: ఈ పదార్థాలను పాలతో కలిపి తీసుకుంటున్నారా… సమస్యల వలయంలో చిక్కుకున్నట్లే!

Health Benifits: మనలో చాలామంది పాలు, పాల పదార్థాలు, డైరీ ప్రొడక్ట్స్ చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే పాలు త్రాగేటపుడు కానీ, పాల పదార్థాలు, పెరుగు తినేటపుడు కానీ కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు. ఇవి శరీరానికి చెడు చేయడమే కాక విషపూరితంగా కూడా తయారవుతాయి. చాలా మంది భోజనం చివరిలో పెరుగుతో ముగీయనిది వారికి భోజనం చేసినట్టు ఉండదు. అయితే ఆ టైం లో ఈ క్రింద సూచించిన పదార్థాలను కనిపి తినకపోవడం చాలా శ్రేయస్కరం.

పనస కాయ లేదా కాకరకాయని పాలు, పెరుగు తీసుకునేటప్పుడు తినకూడదు. ఇలా తీసుకోవడం వల్ల సోరియాసిస్, చర్మం మీద దురద వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

చేపలు లేదా చికెన్ ను పాలు, పెరుగుతో పాటుగా తినకూడదు. పాలు ఇంకా పెరుగు ఇలాంటి డైరీ ప్రొడక్ట్స్ లతో పాటుగా చికెన్, చేపలను అసలు తినకూడదు. ఇలా చేయడం వల్ల అజీర్తి సమస్యలు పెరుగుతాయి. ఈ రెండు పదార్థాలను పాలు లేదా పెరుగుతో కలిపి తిన్నట్లయితే కడుపు నొప్పి గ్యాస్ ఫామ్ అవడం జరుగుతాయి .

కమలా, ద్రాక్ష, నిమ్మ మొదలైనవి పాల పదార్థాలతో పాటు తీసుకుంటే కడుపు నొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాక ఆహారం విషం కింద మారుతుంది. మీరు కనుక నువ్వులు, ఉప్పు తిన్నట్లయితే వెంటనే పాలు పాల పదార్థాలు తీసుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత పాల పదార్థాలను సేవించడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

మినప్పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది. మినపప్పు ని పాల పదార్థాలతో తినటం వల్ల కడుపు నొప్పి, కడుపుబ్బరం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి పాలు లేదా పాల పదార్థాలు తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.