Health Tips: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాల్సిందే!

Health Tips: మానవ శరీరంలో ముఖ్యమైన శరీర భాగాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. కానీ మారుతున్న ఆహారపు అలవాట్ల వలన చాలామంది రోగాల బారిన పడుతున్నారు. మనిషికి శ్వాస ఎంత ముఖ్యమైనదో కిడ్నీల పనితీరు కూడా అంతే ముఖ్యమైనది. మూత్రపిండాలు ఆరోగ్యవంతంగా లేకపోతే శరీరం మొత్తం విషపూరితమైన వ్యర్థాలు బయటికి పోకుండా నిండిపోయి, కిడ్నీలు త్వరగా పాడైపోతాయి.

మనం తినే కొన్ని ఆహార పదార్థాలు మూత్రపిండాల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మూత్రపిండాల పనితీరు సరిగా లేకుంటే శరీరంలో అనేక మార్పులు జరిగి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అందువల్ల ఈ ఐదు ఆహార పదార్థాలు తినేటప్పుడు లేదా తాగేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి.

ఏ ఆహార పదార్థం అయినా మితంగా తింటే ఆరోగ్యం , అమితంగా తింటే అనారోగ్యం.. అందులో ఒకటి ఉప్పు మనం రోజూ తినే వంటలలో ఉప్పు లేనిదే ఏ వంటకం ఉండదు. ఉప్పు ఎక్కువగా తింటే అది మూత్రపిండాల పనితీరు పై ప్రభావం చూపిస్తుంది. ఉప్పుని తగినంతగా వాడటం వలన మూత్రపిండాల సమస్యలు దరిచేరవు.

మనలో చాలామందికి నాన్ వెజ్ అంటే విపరీతమైన మక్కువ ఉంటుంది. అయితే మటన్, బీఫ్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరములో కొలెస్ట్రాల్ పెరిగి మీ బాడీ మెటబాలిజంను తగ్గిస్తుంది. మటన్, బీఫ్ లాంటి పదార్థాలు జీర్ణం కావటానికి మూత్రపిండాల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. మాంసాహారము తొందరగా అరగకపోవటం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. మాంసాహారం తగిన పరిమాణంలో అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవడం మంచిది.

చాలామందికి కూల్ డ్రింక్ తో పాటు కుకీస్, స్వీట్స్ తినడం అలవాటు ఉంటుంది. వీటి తయారీలో ఆర్టిఫిషియల్ షుగర్ ఎక్కువగా వాడుతారు. కిడ్నీ పనితీరు పై ప్రభావం చూపుతాయి. ఈ అలవాటు ఉన్నవారు వీలైనంత త్వరగా అలవాటు మార్చుకోవడం మంచిది.

ప్రస్తుత కాలంలో యువత ఆల్కహాల్ అంటే చాలా మక్కువ చూపిస్తారు. ఫ్రెండ్స్ కలిసిన, ఏవైనా పార్టీ ఉన్న, బర్త్ డే సెలబ్రేషన్ ఉన్నా ఆల్కహాల్ వాడుతుంటారు. ఇది మీ లివర్ మీద మాత్రమే కాకుండా కిడ్నీల మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది.

కాఫీ తాగడం చాలా మందికి ఉండే అలవాటు. కాఫీ తాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అయితే ఎక్కువగా కాఫీ తాగడం వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాఫీలో ఉండే కెఫీన్ కిడ్నీలకు హాని కలిగిస్తుంది.