చలికాలంలో దగ్గు జలుబు సమస్యతో బాధపడుతున్నారా.. వీటికి దూరంగా ఉండాల్సిందే?

కాలంతో పనిలేకుండా ఇప్పుడు ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇంక శీతాకాలం అంటే చెప్పనక్కర్లేదు. ఈ సీజన్లో దగ్గు ,జలుబు ,జ్వరం వంటివి తరచుగా వెంటాడే ఆరోగ్య సమస్యలు. జలుబు దగ్గు జ్వరం వంటివి సాధారణ స్థాయిలో ఉంటే ఎటువంటి ప్రమాదము ఉండదు. కానీ వాటి తీవ్రత పెరిగితే చాలా ప్రమాదం. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఇమ్యూనిటీపవర్ తక్కువగా ఉన్నవారినీ తరచుగా వేధిస్తుంటాయి. ఇమ్యూనిటీపవర్ తక్కువగా ఉన్నవారు వారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో దగ్గు ,జ్వరం ,జలుబు ఉన్నప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జ్వరం జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు అల్లం, వెజిటబుల్ సూప్, స్పైసీ ఫుడ్, గంజి, విటమిన్ సి, హనీ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ప్రమాదం ఇంకా పెరుగుతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లు, పండ్ల రసాలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు .కానీ పులుపు, సిట్రస్ జాతి పండ్లు జలుబు , దగ్గు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల దగ్గు ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కనుక జలుబు దగ్గు ఉన్నప్పుడు ఆరెంజ్, ద్రాక్ష వంటి పండ్లు తినకపోవడమే మంచిది.

పాలను పోషక విలువలతో కూడిన ఒక “పోషకాల గని” అని వర్ణించవచ్చు. కానీ దగ్గు జలుబు చేసినప్పుడు పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగటం వల్ల కొంచెం ఊరటనిస్తుంది. దగ్గు జలుబు జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నప్పుడు తొందరగా జీర్ణం కాని పదార్థాలను తినడం వల్ల చాలా ప్రమాదం ఉంది. ముఖ్యంగా ‘ జంక్ ఫుడ్’ వంటివి తీసుకోవడం చాలా ప్రమాదం. అలాగే బిస్కెట్స్ మైదా పిండితో తయారు చేయడం వల్ల అవి తొందరగా జీర్ణం కావు. అందువలన బిస్కెట్స్ కి దూరంగా ఉండడమే మంచిది.