మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగించడం వల్ల దేవుడి ఆశీస్సులు పొంది ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే ఏదైనా శుభకార్యాలలో కూడా మొదటగా దీపం వెలిగించిన తర్వాతనే శుభకార్యాలు ప్రారంభిస్తారు. ఇలా మన హిందూ ధర్మంలో పూర్వకాలం నుండి దీపాలికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవుడి ముందు దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
అయితే దీపాన్ని వెలిగించడానికి మట్టి ప్రమిదలు, వెండి దీపాలు, ఇత్తడితో చేసిన దీపాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో పిండితో తయారుచేసిన దీపాలను కూడా ఉపయోగిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పిండిదీపం చాలా శక్తివంతమైనది. దేవుడి ముందు పిండి దీపం వెలిగించి పూజించటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. కోరిన కోరికలు నెరవేరాలంటే దేవుడి ముందు పిండి దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం పొంది ధనవంతులుగా మారాలంటే లక్ష్మీదేవి ముందు పిండి దీపాలు వెలిగించి ఆరాధించాలి.
11 రోజులపాటు లక్ష్మీదేవి ముందు పెరుగుతున్న లేదా తగ్గుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే పిండిలో పసుపు కలిపి దీపాలను చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వల్ల విష్ణువు కటాక్షం కూడా లభిస్తుంది. ఇలా చేయటం వల్ల జీవితంలో చేసే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. అలాగే అన్నపూర్ణాదేవి ముందు పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించి ఆ దేవిని ప్రార్థించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తుంటే శని దేవుడి ముందు 11 రోజులపాటు పిండితో తయారుచేసిన దీపాలను వెలిగించడం వల్ల నష్టాలనుండి విముక్తి లభిస్తుంది.