Atlee – Allu Arjun: అట్లీ – అల్లు అర్జున్.. హీరోయిన్ ఎవరంటే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ ‘AA22’పై ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన వీడియో గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. బన్నీ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని సమాచారం. మే చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే రామ్ చరణ్‌తో ‘పెద్ది’లో నటిస్తున్న జాన్వీ, బన్నీ సినిమా కూడా పట్టేసిందని తెలుస్తోంది. తొలుత సమంత , ప్రియాంకపేర్లు చక్కర్లు కొట్టినా.. ఇప్పుడు జాన్వీనే ఫిక్స్ అయ్యేలా ఉందని ఫిల్మ్ నగర్ లో చర్చ. అల్లు అర్జున్ – జాన్వీ కాంబినేషన్ తెలుగు మార్కెట్‌తో పాటు నార్త్ ఇండియాలోనూ బలమైన క్రేజ్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నట్టు సమాచారం. అందుకే మరో హీరోయిన్ కోసం కూడా మేకర్స్ వెతుకులాటలో ఉన్నారని తెలుస్తోంది. అట్లీ తన మార్క్ మాస్ టచ్‌తో పాటు ఎమోషనల్ డెప్త్ కలిగిన కథను సిద్ధం చేశారట. బన్నీని డిఫరెంట్ షేడ్స్‌లో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేకంగా స్క్రీన్‌ప్లే రూపొందించాడని సమాచారం.

జీ స్టూడియోస్, సన్ పిక్చర్స్ కలిసి నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ అంచనా వేస్తున్నారు. బన్నీ, అట్లీ, జాన్వీ కలయికతో ఈ సినిమా ఒక హై ప్రొఫైల్ మల్టీ లాంగ్వేజ్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండగా, మిగతా నటీనటుల వివరాలు అధికారికంగా తెలియజేయనున్నారు.