మట్టి కుండలో వంట చేయడం వల్ల లాభాలు ఏమిటో తెలుసా?

ఇప్పుడు ఉన్న కాలనుసారం జీవితం చాలా ఉరుకుల పరుగుల మీద నడుస్తోంది. చాలా మందికి తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ టెన్షన్ లైఫ్ లో నుండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది చాలా పద్దతులని ఫాలో అవుతున్నారు. అందరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఎన్ని విదానాలు అవలంబిస్తున్నారో చెప్పనక్కర్లేదు. అలాంటి వాటిలో ఒకటి మట్టి పాత్రలో వంట వండుకోవడం.
పూర్వము అందరూ వంటింట్లో వండాలి అంటె కచ్చితంగా మట్టి పాత్రలనే వినియోగించేవారు. క్రమేపీ మారుతున్న కాలాన్ని బట్టి మట్టి పాత్ర బదులుగా రాగి, వెండి, ఇప్పుడు అయితే స్టీల్ పాత్రలు , నాన్ స్టిక్ వస్తువులు వినియోగిస్తున్నారు.అయితే మట్టి కుండలో ఆహారాన్ని వాడటం వల్ల కలిగే లాభాలు ఇప్పటి జనరేషన్ కు తెలిసి కుండల వాడకం పెరిగింది.

మట్టి పాత్రలలో ఆహారాన్ని ఉంచడం ద్వారా భాస్పరమ్, కాల్షియం, మెగ్నీషియం వంటివి శరీరానికి అందుతాయి. అయితే ఇతర గాజు, ఐరన్, సిల్వర్ వంటివి అలాంటి ప్రయోజనలు అందించవు. అంతే కాకుండా మట్టి పాత్రలో వండిన ఆహారానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇది మలబద్దకం, అజీర్తి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మట్టి కుండలో వండే వంటలు మంచిదని నిపుణుల సలహా. మట్టి పాత్రలో చాలా సూక్ష్మ పోషకాలు లభిస్తాయి, అవి ఆహారంతో పాటుగా మన శరీరంలోకి ప్రవేశించి పోషకాలను అందిస్తాయి.

ప్రెషర్ కుక్కర్ కానీ సిల్వర్ పాత్రలు కానీ వాడితే వాటిలో ఈ పోషకాలు ఏవి అందవు. మీరు మట్టి కుండలను మీ వంటలో బాగం చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని ఇంకా కాపాడుకున్నట్టే. మీరు మట్టి కుండలను తీసుకున్న తర్వాత వాటిని ఒక 15 నుండి 20 నిమిషాల వరకు నీటిలో నానబెట్టి తర్వాత వండుకోవాలి. వీటిని శుభ్రం చేయడానికి సబ్బు కానీ వేరే డిటర్జెంట్స్ కానీ వాడకూడదు. వేడి నీటితో కడిగితే క్లీన్ అవుతుంది. ఇంకెందుకు లేటు మార్కెట్ కి వెళ్ళి మట్టి పాత్రలని కొనండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి.