ఆఫీస్ టేబుల్ పై పొరపాటున ఈ వస్తువులు ఉంటే అంతే సంగతులు.. సమస్యలు మీ వెంటే?

మన హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి, జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నాయి. దేశం సాంకేతికంగా రోజురోజుకీ అభివృద్ధి చెందిన కూడా ప్రజలు వాస్తు శాస్త్రం పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నారు.అందువల్ల ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ వస్తువులని వాస్తు ప్రకారం ఉంచుకోవాలి. లేదంటే సమస్యల వలలో చిక్కుకుంటారు. ముఖ్యంగా ఆఫీస్ టేబుల్ మీద వస్తులను వాస్తు ప్రకారం ఉంచుకోవాలి. కొన్ని సందర్భాలలో తెలియకుండా చేసే చిన్న పొరపాట్లు వల్ల మన పురోగతి మీద చెడు ప్రభావం చూపుతుంది.

ఆఫీస్ లో మనం కూర్చొనే కుర్చీ వీపు గోడవైపు ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా వాస్తు ప్రకారం మీ వెనుకభాగం ప్రధాన ద్వారం, కిటికీ, ఉత్తరం వైపు ఉండకూడదు. పొరపాటున ఇలా వాస్తు కి విరుద్ధంగా ఉన్నట్లైతే ప్రతికూలతను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఆఫీస్ టేబుల్ పై ఉంచే లాప్టాప్, పేపర్ వెయిట్, పెన్, వాటర్ బాటిల్ వంటి కొన్ని వస్తువులను కూడా వాస్తు ప్రకారం ఉంచాలి.

ఈ వస్తువులను ఆఫీసు డెస్క్‌పై ఉంచండి..

వాస్తు శాస్త్రం ప్రకారం మీ కార్యాలయంలో మీ చుట్టూ ఉంచిన వస్తువుల వల్ల కూడా మీపై సానుకూల , ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇలా మీ ఆఫీసు టేబుల్‌పై ఉత్తరం ,తూర్పు దిశలో క్రిస్టల్ పేపర్ వెయిట్ ఉంచటం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది.
అంతే కాకుండా మీరు మీ టేబుల్‌పై ఉత్తర దిశలో వాటర్ బాటిల్‌ను కూడా ఉంచవచ్చు. అంతేకాకుండా కొంతమంది తమ ఆఫీస్ టేబుల్ మీద మొక్కలు దేవుడి విగ్రహాలు ఉంచడానికి ఇష్టపడతారు. అలాంటివారు వాటిని టేబుల్ ఉత్తర దిశలో ఉంచడం వల్ల అనుకూల ప్రభావం ఉంటుంది.