ప్రస్తుత రోజుల్లో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వంటగదిలో అల్యూమినియం పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నాన్ స్టిక్ పాత్రలను,ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ వల్ల పని ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో ఎక్కువమంది వీటి వినియోగానికి అలవాటు పడ్డారు పని సులువవుతుందన్న సంగతి పక్కన పెడితే ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్, నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వినియోగించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అల్యూమినియం పాత్రల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు మన పూర్వీకులు వంటగదిలో మట్టి పాత్రలను ఎక్కువగా వినియోగించేవారు. ఈ విషయం మనకి తెలియకపోవచ్చు కానీ మన పూర్వీకులు మట్టి పాత్రల్లో ఆహారం తయారు చేసుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొంది సంపూర్ణ ఆరోగ్యంగా జీవించారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఇప్పటికే ఈ విషయం అనేక పరిశోధనాల్లో స్పష్టమైంది కూడా. మట్టి పాత్రలో ఆహారాన్ని వండుకొని తినడం మట్టిలోని ఔషధ గుణాలు ఆహారంలో నిల్వ ఉంటాయి. ఆహారం మరింత రుచిగా ఉంటుంది. కావున వంటగదిలో మట్టి పాత్రలు లేదా స్టీల్ పాత్రలను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో మనం ఎక్కువగా వినియోగిస్తున్న
ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, నాన్ స్టిక్ పాత్రలు టాక్సిన్ మెటల్‌తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు నశించి పోవడంతోపాటు ప్రమాదకర రసాయనాలు విడుదలవుతాయి. ముఖ్యంగా నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దు దీనివల్ల భవిష్యత్తులో ఎముకలు కండరాల్లో పట్టుత్వం తగ్గి కీళ్లనొప్పి, నడుము నొప్పి, కండరాల వాపు , జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.