తల అజిత్ మాస్ ఇమేజ్ మరోసారి హైలెట్ అయ్యింది. తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీకి కథలో పెద్దగా కంటెంట్ లేకపోయినా, తొలి రోజు వసూళ్లు మాత్రం రికార్డులు సృష్టించాయి. తమిళనాడులో మాత్రమే ఈ సినిమా రూ.21.85 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇది అజిత్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కావడం గమనార్హం.
దర్శకుడు అధిక్ రవిచంద్రన్ రూపొందించిన ఈ సినిమాలో కథ బాగోలేకపోయినా, ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ ఎలివేషన్లు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా అజిత్ స్టైల్ ఫైట్స్, బ్యాక్‌డ్రాప్ ప్రెజెంటేషన్ బాగున్నాయని అభిప్రాయపడుతున్నారు. కథలో ఎమోషన్ లేకపోవడమే సినిమా బలహీనతగా పేర్కొంటున్నారు. అయినా ఓపెనింగ్ డే వసూళ్లు మాత్రం షాక్ ఇచ్చాయి.
ఇటీవల విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాకు రూ.20.66 కోట్లు, అజిత్ ఇటీవల చేసిన సినిమా ‘విదాముయర్చి’కి రూ.18.21 కోట్ల వసూళ్లు రాగా.. గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం వీటిని దాటి మాస్ స్టామినాని చూపించింది. రజినీకాంత్ ‘వెట్టయన్’, సూర్య ‘కంగువా’ చిత్రాలు ఈ లెవెల్ రీచ్ కాలేకపోయాయి. కానీ రివ్యూలు ఓ మోస్తరుగా ఉండటంతో దీర్ఘకాలికంగా సినిమాకి నిలకడ ఉండేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. సోమవారం కలెక్షన్లు కీలకంగా మారబోతున్నాయి. ఏం జరిగినా… కథ బలహీనమైనా… అజిత్‌కు ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమా ఓపెనింగ్‌ను ఊహించని స్థాయికి తీసుకెళ్లింది.
