స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కు రూ.800 కోట్ల బడ్జెట్‌ను ఖరారు చేయడం, అలాగే అట్లీకి రెమ్యునరేషన్‌గా రూ.125 కోట్లు చెల్లిస్తున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.
అట్లీ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో షారుఖ్ ఖాన్‌తో చేసిన ‘జవాన్’ ఒక్కటే 1000 కోట్ల బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఆ సినిమాకు క్రెడిట్ ఎంతవరకు అట్లీకి, ఎంతవరకు స్టార్ పవర్‌కు అన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే. మిగతా సినిమాలు అయినా మెర్సల్, బిగిల్, థెరిలోనూ హీరో క్రేజ్ ఎక్కువగానే పనిచేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అలాంటి డైరెక్టర్‌కు 125 కోట్లు ఇచ్చేంత స్థాయిలో క్రెడిబిలిటీ ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక బన్నీ విషయానికి వస్తే ‘పుష్ప 2’ తర్వాత తనను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లే ఓ భారీ సినిమా చేయాలన్నదే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో కలిపి డిజైన్ చేస్తున్న ఈ సినిమాలో విజువల్స్, టెక్నికల్ స్టాండ్‌ర్డ్స్‌పై ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే VFX కోసమే రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నారట.
ఒకవైపు అట్లీకి 125 కోట్లు, మరోవైపు బన్నీకి 175 కోట్లు అంటే.. రెమ్యునరేషన్‌లకే దాదాపు బడ్జెట్ లో పావు భాగం ఖర్చవుతోంది. సినిమా విడుదలయ్యే దాకా ఈ ఖర్చు వ్యర్థమా లేదా అనేది తెలియదు. కానీ బన్నీ, అట్లీ కాంబినేషన్ అంచనాలు పెంచిందనేది మాత్రం స్పష్టమే. 2026లో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యేలోగా, ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.