Vijay Devarakonda: జెట్ స్పీడ్ లో విజయ్ దేవరకొండ.. ఆ ప్రాజెక్టు ఈ డిసెంబర్‌కే?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లో స్పీడ్ పెంచాడు. ఒకవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ‘కింగ్ డమ్’ సినిమాను మే 30న విడుదల చేయబోతున్న విజయ్, మరోవైపు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందనున్న సినిమా టైటిల్‌ను ‘రౌడీ జనార్దన్’గా ఫిక్స్ చేశారని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఈ సినిమా విజయ్ అభిమానులకు కొత్త ఊపును ఇస్తోంది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించే అవకాశం ఉందని టాక్. నేటివిటీ టచ్ ఉన్న కథలో విజయ్ స్టైల్ మాస్ రోల్స్‌కి కాంబినేషన్‌గా ఈ జోడీ ఆకట్టుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వగా, ప్రీ-ప్రొడక్షన్ దశ కూడా కంప్లీట్ అయిందట. జూన్‌లో షూటింగ్ ప్రారంభించి అక్టోబర్‌లోపు షూట్ ముగించేందుకు మేకర్స్ భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అంటే నాలుగు నెలల్లో సినిమాను రెడీ చేయాలన్నది టార్గెట్.

‘ఫ్యామిలీ స్టార్’ నిరాశపరిచిన తర్వాత విజయ్ ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథ, కథనంలో బలంగా ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని సమాచారం. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ మిక్స్‌తో పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. టైటిల్‌ని బట్టి చూస్తేనే ‘రౌడీ జనార్దన్’లో మాస్ ట్రీట్ ఉండబోతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా విజయ్‌కు మరో హిట్ తీసుకురావాలన్న నమ్మకంతో తెరకెక్కుతోంది. రవికిరణ్ కోలా గతంలో ‘రాజావారు రాణిగారు’తో దర్శకుడిగా తన టాలెంట్‌ను చూపించగా, ఇప్పుడు విజయ్‌తో కలిసి మాస్ క్లాస్ మిక్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. డిసెంబర్‌లో సినిమా రిలీజ్ చేయాలన్న మేకర్స్ ప్లాన్ విజయవంతమైతే… విజయ్‌కు ఇది టర్నింగ్ పాయింట్ కావచ్చు.