Health Tips: ప్రతిరోజు పండ్లు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఒక్కో పండు లో ఒక్కో రకమైన పోషకాలు తగ్గి ఉంటాయి.శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు ఏదో ఒక రకమైన పండ్లు తప్పనిసరిగా తినాలి అని డాక్టర్లు సూచిస్తుంటారు.ఇప్పుడు మనం సపోటా పండు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
సపోటా పండు చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉన్నా కూడా రుచి ఎంతో తీయగా ఉంటుంది. సపోటా పండు లో ఉన్న అనేక రకాల పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సపోటా పండు లో ఐరన్, ఫోలేట్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్, మినరల్స్ వంటి పోషక పదార్థాలు ఉంటాయి. సపోటా పండు లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. సపోటా లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందిస్తాయి.
సపోటా కంటి చూపు మెరుగు పరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. వీటిలో విటమిన్ ఎ ఉండటం వల్ల వయసు పెరిగినా కూడా కంటి చూపు సమస్యలు తగ్గిస్తుంది. కనుక ప్రతి రోజూ మనం తీసుకునే రోజువారి ఆహారంలో సపోటలను జత చేర్చుకోవాలి. సపోటా పండ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి.
సపోటా లతో క్యాన్సర్ సమస్యలను కూడా అదుపు చేయవచ్చు.వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉంటుంది. క్యాన్సర్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఒకటి లేదా రెండు సపోటా పండ్లను తినటం వలన వ్యాధి తీవ్రత పెరగకుండా కాపాడవచ్చు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా సపోటా పండ్లు తినటం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
