Fenugreek seeds: వాతావరణంలోని మార్పులు, నిత్యం పెరుగుతున్న కాలుష్యం జుట్టుపై దృష్ప్రభావాన్ని చూపుతున్నాయి. నిత్యం వెంట్రుకలు రాలిపోవడం, చిట్లిపోవడం, త్వరగా తెల్లజుట్టు రావడం లాంటి సమస్యలతో యువతీ యువకులు వేదనకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యకు పరిస్కారం కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంట్లోనే సింపుల్ చిట్కాలు పాటించి పరిస్కారం పొందవచ్చు. మెంతులు… జుట్టు సమస్యలకు చక్కని ఔషధమని తెలుసా?. మెంతులు శిరోజాలకి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే ఔరా అనాల్సిందే. మెంతుల్ని ఎలా వాడితే ఏం ఉపయోగం ఉందో తెలుసుకుందాం రండీ…
మెంతులు-కొబ్బరి నూనె: కొన్ని మెంతుల్ని తీసుకొని గోరువెచ్చని కొబ్బరి నూనెలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ మిశ్రమాన్ని మెత్తని చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి కుదుళ్లతో సహా పట్టించాలి. అరగంట సేపు అలా ఉంచిన తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చెయ్యాలి. ఇలా వారంలో 2, 3 సార్లు చేస్తే జుట్టు రాలడం, చిట్లడం తగ్గి ఆరోగ్యవంతమైన శిరోజాలు సొంతం అవుతాయి. అంతే కాకుండా జుట్టు మృదువుగా పెరుగుతుంది.
మెంతులు-పెరుగు: చుండ్రు సమస్యని కూడా మెంతులు త్వరగా పోగొడతాయి. దీని కోసం చెయ్యల్సిందంతా ఒక్కటే… కప్పు పెరుగులో 50 గ్రాముల మెంతులు రాత్రంతా ఉంచి ఉదయం మెత్తగా చేసుకుని తలంతా పట్టించి ఒక గంట పాటు వదిలేయండి. తర్వాత వేడి నీటితో తలను శుభ్రం చేసుకుంటే చుండ్రు పోవడమే కాకుండా జుట్టు నిగనిగలాడుతుంది కూడా.
మెంతులు- మందారం: ఇక జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే మెంతులకి మందార పూలు జోడిస్తే చాలు. మెంతులు, మందార పూలు కలిపి మెత్తని చూర్ణంలా చేసి జుట్టుకి పట్టించాలి. అరగంట ఉంచాక గోరు వెచ్చని నీతో తల స్నానం చేస్తే సరి. జుట్టు రాలడం తగ్గి దృఢంగా తయారవుతుంది. వారానికి మూడు సార్లు ఇలా చెయ్యడం ద్వారా జుట్టుకి సంబంధించిన ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు.
