ఆ రెండు షోలకి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

బుల్లితెర ప్రేక్షకులలో సుధీర్ కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ప్రతివారం ప్రసారమవుతున్న జబర్దస్త్ లో గెటప్ శీను, సుడిగాలి సుదీర్ ,ఆటో రాంప్రసాద్ కలిసి చేసే సందడి అంతా కాదు. దీంతో సుధీర్ బాగా ఫేమస్ అయ్యాడు. అంతేకాకుండా రష్మి తో ఉన్న ట్రాక్ వల్ల కూడా సుధీర్ పాపులర్ అయ్యాడు. ఇలా జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షో లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుధీర్ కొంతకాలం క్రితం ఈటీవీ కి స్వస్తి చెప్పాడు.

అయితే అందుకు గల కారణం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియటం లేదు. చాలా కాలం నుండి మా టీవీ వారు సుధీర్ కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా వెళ్లని సుధీర్ ఇప్పుడు ఇలా అన్ని షోస్ ని వదిలి వెళ్ళాడు. సుధీర్ మొదట ఢీ షో నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ లో కనిపించలేదు. కానీ కొంత కాలం శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో యాంకర్ గా సందడి చేసాడు. ఇప్పుడు అక్కడ కూడ కనిపించటం లేదు. సుధీర్ ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్, పార్టీ లేదా పుష్ప అనే షోస్ లో యాంకర్ గా సందడి చేస్తున్నాడు. సుధీర్ ఇలా మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో కనిపించడానికి ముఖ్య కారణం మాటీవీ వారు డబుల్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయటం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్ గా చేసే సమయంలో సుధీర్ ఒక షెడ్యూల్ కి దాదాపు తొమ్మిది నుండి పది లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకునేవాడు. కానీ మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్, పార్టీ లేదా పుష్ప అనే షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్నందుకు ఒక్క ఎపిసోడ్ కి దాదాపు 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి సుధీర్ తనకి జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ షో ని వదిలి ప్రస్తుతం మా టీవీ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అల్లరిస్తున్నాడు. ఇదిలా ఉండగా మాటీవీలో ప్రసారం అవుతున్న పార్టీ చేద్దాం పుష్ప అనే షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమోలో నాగబాబు, ధనరాజ్ సుధీర్ పై సెటైర్లు వేశారు.