Health Tips: మహిళలు ఎక్కువగా బోర్లా పడుకుంటున్నారా… ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త..!

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో.. రోజుకు సరిపడ నిద్ర కూడా అంతే అవసరం. రోజుకు సగటున ఎనిమిది గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకు సరిపడ సమయం నిద్రపోవటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి అనుకున్న పని సక్రమంగా పూర్తి చేయవచ్చు. ప్రస్తుత కాలంలో పని వత్తిడి వల్ల సమయానికి ఆహారం తినక, సమయానికి నిద్రపోకపొవటం వల్ల చాలా మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే చాలామందికి బోర్లా పడుకొని నిద్రపోయే అలవాటు ఉంటుంది. అల బోర్లా పడుకొని నిద్రపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలు బోర్లా పడుకుని నిద్రపోవటం ఈ అనేక సమస్యలు తలెత్తుతాయి. గర్భంతో ఉన్న మహిళలు బోర్లా పడుకొని నిద్రపోవటం వల్ల తల్లికి, కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం తప్పదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎక్కువగా బోర్లా పడుకుని నిద్రపోయే వారికి ఛాతి నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. బోర్లా పడుకోవటం వల్ల శరీరం మొత్తం బరువు ఛాతి మీద పడటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.

బోర్లా పడుకొని నిద్రపోవటం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక అజీర్తి, కడుపు ఉబ్బరంగా వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువగా బోర్లా పడుకోవటం వల్ల వెన్ను నొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంది.

బోర్లా పడుకోవటం వల్ల ముఖం మీద మచ్చలు, మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బోర్ల పడుకున్నప్పుడు ముఖానికి ఆక్సిజన్ సరిగా అందక ఒక మీద చర్మం ముడతలు పడుతుంది. ఉండా తలగడ లోని దుమ్ము ధూళి కణాలు ముఖం మీద కు చేరి మొటిమలు,చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.