Home News రౌడీ మీద అంత అంటే కష్టమే అంటున్న సినీ వర్గాలు!

రౌడీ మీద అంత అంటే కష్టమే అంటున్న సినీ వర్గాలు!

విజయ్ దేవరకొండ – డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రానికి ”లైగర్” అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విడుదల చేసిన ‘లైగర్’ ఫస్ట్ లుక్ కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ చూసి వీడీ ఫ్యాన్స్ కేకులు కట్ చేయడంతో పాటు ‘లైగర్’ అని టాటూస్ వేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. మొదట ఈ సినిమా కు టైటిల్‌ ఫైటర్ అంటూ ప్రచారం జరిగింది. కాని చివరికి ‘లైగర్’ అని అఫిషియల్‌ గా ఖరారు చేశారు.

Can Vijay Devarakonda Collect Such A Budget For His Film Ligar?
Can Vijay Devarakonda collect such a budget?

విజయ్ దేవరకొండ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే ఈ చిత్రంలో విజయ్‌ కు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన ‘కరణ్‌ జోహార్’ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండడంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.  ప్రస్తుతం లైగర్ సినిమా బడ్జెట్ విషయంలో ఫిలిం నగర్ నుండి అందిన సమాచారం ప్రకారం ‌డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు ఏకంగా వంద కోట్లు పైనే ఖర్చు పెటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ మూవీలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయట. హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ , ఫైటర్స్ మరియు పెద్ద ఎత్తున ఫారిన్ షెడ్యూల్స్ ఉన్న కారణంగా ఈ రేంజ్ లో ఖర్చు అవుతుందని అంటున్నారు. అయితే విజయ్‌ దేవరకొండపై ఈ రేంజ్ బడ్జెట్‌ పెట్టడం అంటే చాలా పెద్ద రిస్క్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. సూపర్‌ హిట్‌ అయినా కూడా ఆ రేంజ్ వసూళ్లు రావని కొందరు అంటున్నారు. మా రౌడీకి పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న ఫాలోయింగ్ మీకు తెలియట్లేదు,ఈ బడ్జెట్ ఈజీ టాస్క్ అని విజయ్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.

- Advertisement -

Related Posts

నిర్మాత‌ల‌కు క‌ళ్ళు బైర్లు క‌మ్మిస్తున్న ఉప్పెన బ్యూటీ..!

ఒక్క సినిమాతో త‌న రాత‌నే మార్చుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డి సొంతం. తెలుగు అమ్మాయి కాక‌పోయిన ప‌నిపై శ్ర‌ద్ధ‌తో కొద్ది రోజుల‌లో తెలుగు...

మంచు ల‌క్ష్మీ మెచ్చిన మీమ్.. సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్

సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక మీమ్స్ తో అనేక ఫ‌న్నీ జోక్స్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్ర‌హ్మానందంతో క్రియేట్ చేసే మీమ్స్ సామాజిక మాధ్య‌మాల‌లో తెగ హ‌ల్‌చ‌ల్ చేయ‌డ‌మే కాక, ఫుల్ వైర‌ల్...

చిరంజీవి క్లాసిక్ టైటిల్‌పై క‌న్నేసిన ర‌వితేజ‌.. అవధులు దాటిన ఫ్యాన్స్ ఆనందం

మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు చేశారు. మంచి మంచి టైటిల్స్‌తో సినిమాలు చేసిన మెగాస్టార్ అందులో ఆణిముత్యాల్లాంటి పాట‌లు ఉండేలా చేసుకున్నారు. పాట‌కు అనుగుణంగా న్య‌త్యం చేస్తూ అశేష...

బాలీవుడ్‌కు వెళ్లిందో లేదో ముంబైలో కాస్ట్‌లీ ఫ్లాట్ కొనేసిన క‌న్న‌డ ముద్దుగుమ్మ‌

ఈ కాలం నాటి అందాల భామ‌లంద‌రు దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న స‌మ‌యంలో విప‌రీతంగా రెమ్యున‌రేష‌న్ పెంచి భారీగా దండుకుంటున్నారు. నిర్మాత‌లు చేసేదేం లేక కొంద‌రు భామ‌లు...

Latest News