Pearl Millet Benifits: సజ్జల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలా? ఈ సమస్యతో బాధపడేవారికి ఇవి ఎంతో ఉపయోగకరం..!

Pearl Millet Benifits:ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు వాతావరణ కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కొంతమందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి ఆహారం విషయంలో పాత పద్ధతులను పాటించటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరహాలోనే అందరూ తృణధాన్యాలు తినటానికి ఇష్టపడుతున్నారు. తృణధాన్యాలు ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు దాగివున్నాయి. వీటిలో సజ్జలు కూడా ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ధాన్యం. మన ఆహారంలో సజ్జలు చేర్చుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం శీతాకాలంలో సజ్జలతో రొట్టెలు చేసుకుని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. సజ్జల లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల శరీరంలో లో జీర్ణక్రియ మెరుగుపడి ఊబకాయం వంటి సమస్యలు ఉండవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో డాక్టర్లు కూడా ఇటువంటి పోషకవిలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం మంచిదని సూచిస్తుంటారు. సజ్జల వల్ల ఊబకాయం సమస్య మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

సజ్జల లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా జరిగి ఎటువంటి జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తకుండా ఉంటాయి. మిల్లెట్ శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ రక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. సజ్జల లో యాంటీఆక్సిడెంట్స్ తో పాటు ఫినాలిక్ లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి చర్మ రక్షణకు ఉపయోగపడతాయి.

శరీరానికి కావలసిన ఐరన్ మిల్లెట్స్ లో పుష్కలంగా లభిస్తుంది. ఐరన్ లోపం ఉన్నవారు ప్రతిరోజు సజ్జలతో తయారు చేసిన ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. సజ్జల లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతాయి. తద్వారా గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ప్రతిరోజు ఆహారంలో మిల్లెట్ చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తి లభిస్తుంది.