అనసూయ ఎందుకు ఓడిపోయింది.? ఆమెకీ డౌటొచ్చింది.!

 

రికార్డు స్థాయి మెజార్టీతో అనసూయ భరద్వాజ్ ‘మా’ ఎన్నికల్లో ఈసీ మెంబర్‌గా (ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి) గెలిచినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజున, సాయంత్రం సమయంలో వార్తలు బయటకొచ్చాయి.

కానీ, రెండో రోజుకి ఫలితం మారిపోయింది. అనసూయ ఓడిపోయింది. ఈ విషయమై సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా మీమ్స్ దర్శనమిస్తున్నాయి. చాలామంది అభిమానులు అనసూయ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గెలిచిన అనసూయని ఎలా ఓడించారబ్బా.? అని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.

అనసూయ అభిమానులే కాదు, సినీ పరిశ్రమలోనూ ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. అనసూయ, మంచు విష్ణుతో కలిసి విక్టరీ సింబల్ చూపించినట్టుగా సందడి చేశారు కౌంటింగ్ రోజున సాయంత్రం. అలాంటప్పుడు, అనసూయ ఓడిపోవడమెలా సాధ్యమవుతుంది. పైగా, బంపర్ మెజార్టీతో విజయం.. అని అన్నప్పుడు, ఓడిపోవడానికి చాన్సే వుండదు.

రాత్రి సమయంలో బ్యాలెట్ పత్రాల్ని కొందరు ఎత్తుకెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది.. ఇందులో నిజమెంత.? అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది అనసూయ. ‘మా’ ఎన్నికల్లో ఇలాంటివి కూడా జరిగాయా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.