Anasuya: తెలుగు ప్రేక్షకులకు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట తెలుగులో యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు యాంకర్ గా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన అనసూయ ఇప్పుడు వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది మన రంగమ్మత్త. జబర్దస్త్ యాంకర్ గా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ఇపుడు బుల్లితెరను సైడ్ చేసి నటిగా వెండితెర మీద వెలుగు వెలిగిపోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న అనసూయ తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ల సెలబ్రేషన్స్ కోసం వచ్చింది. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆదిపై రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.
బాబుగారు, ఇంద్రజగారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లేముందు వద్దు ఆది, నాకు కొన్ని మైక్ లోనే చెప్పేస్తా నేను అన్నీ నాతో పాటు స్కిట్ చేసి నేను ఎంత ఎంకరేజ్ చేశాను. నా ఎక్స్‌క్లూజివిటీ యాడ్ అవలేదు. అది నా ఏడుపు అని అనసూయ అనగా.. వెంటనే హైపర్ ఆది మాట్లాడుతూ.. ఒరేయ్ నువ్వు అమెరికా వెళ్లినా సరే నీకు లింకులు పంపించాను. అది రా మన లింక్. ఏమనుకుంటున్నావ్ రా నువ్వు అని అన్నాడు. అప్పుడు వెంటనే అనసూయ స్పందిస్తూ.. ఇదిగోండి ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్లిపోయింది అని ఆవేశంగా చెప్పుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

