Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ వెండి తెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన గురించి ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం అసలు ఊరుకోదు. ఇటీవలే తన వస్త్రధారణ గురించి తన ఫ్యాషన్ గురించి సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేయడంతో వారికి తనదైన స్టైల్ లోనే వారిని ఇచ్చారు.
నేను నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను. నా ఇష్టాల గురించి మాట్లాడటానికి మీరెవరు నేను నాకు నచ్చిన బట్టలను నేను వేసుకుంటాను అంటూ సుదీర్ఘమైన లేఖ విడుదల చేస్తూ తన గురించి విమర్శలు చేసిన వారికి తనదైన స్టైల్ లోనే కౌంటర్లు ఇచ్చారు.. ఇలా ఈ విషయం మర్చిపోకముందే మరోసారి అనసూయ బూతులు తిడుతూ వార్నింగ్ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి.
అనసూయ సినిమాలతో పాటు పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే ఇటీవల ఈమె మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారు అయితే అక్కడ ఆమె మాట్లాడుతూ ఉండగా కొంతమంది యువత అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. ఈ మాటలు కాస్త అనసూయ చెవిన పడటంతో ఈమె కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.”చెప్పు తెగుద్ది మీ ఇంట్లో మీ అమ్మ, చెల్లి,మీ భార్య, మీకు కాబోయే భార్యను ఇలాగే ఏడిపిస్తే మీరు ఊరకనే ఉంటారా? పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో మీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదా అంటూ వేదికపైనే అనసూయ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడిన విమర్శలు చేసిన అనసూయ ఏమాత్రం క్షమించరని చెప్పాలి.
