Anasuya -Rashmi: బుల్లితెరపై ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా దర్శకులుగా కొనసాగుతున్నారు. ఇక ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ 12 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా సెలబ్రేషన్స్ అంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఆగస్టు 8, 9వ తేదీలలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా అనసూయ కూడా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే అనసూయ మాట్లాడుతూ తనకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో ఇచ్చిందని తెలిపారు. తాను కెరియర్ పరంగా ప్రస్తుతం ఎలా ఉన్న ఈ జన్మకు తాను జబర్దస్త్ అనసూయనే అంటూ తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే అందరూ ఆటపాటలతో తమ స్కిట్లతో ప్రేక్షకులను సందడి చేశారు.
ఇకపోతే అనసూయ మాట్లాడుతూ.. జీవితం బోలెడు అవకాశాలు ఇవ్వదని చాలామంది చెబుతుంటారు కానీ నేను మాత్రం అవకాశం ఇస్తుందని నమ్ముతాను. నేను కొందరితో ప్యాచప్ చేసుకోవాలి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లి రశ్మిని కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యారు. అనసూయ అలా వెళ్లడంతో రష్మి ఏకంగా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చారు. అనంతరం అనసూయ మాట్లాడుతూ మన ప్యాచప్ కారణంగా ఎవరికి తెలియని విషయాలు కూడా తెలిసిపోయేలాగా ఉన్నాయ్ నిజంగానే మనం గొడవ పడ్డామని డిస్కషన్ జరుగుతాయని తెలిపారు. మరి అలాంటప్పుడు ఏ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడొచ్చు కదా అంటూ రష్మీ తెలిపారు. ఇలా ఈ ఇద్దరి సంభాషణ చూస్తుంటే మాత్రం ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని స్పష్టమవుతుంది అయితే ఆ గొడవలు ఏంటి అనేది మాత్రం పూర్తి ఎపిసోడ్ ప్రసారమైన తర్వాతనే తెలుసుకోవాల్సి ఉంటుంది

