ఎన్టీఆర్ తర్వాత బాలయ్యని ఎదుర్కోనున్న మహేష్..ఎప్పుడు నుంచి అంటే.!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దర్శకుడు పరశురాం తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాతో పాటుగా మహేష్ పలు యాడ్స్ మరియు బుల్లితెర షోలకి కూడా హాజరు కావడం స్టార్ట్ చేసాడు. అందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కి స్పెషల్ గెస్ట్ గా హాజరు అయ్యాడు.

ఇక ఇప్పుడు మహేశ్ బాబు ఇంకో నందమూరి హీరో నందమూరి బాలకృష్ణ తో ఎదురుగా కూర్చోనున్నారట. అదే బాలయ్య ఎంతో హంగామా గా చేస్తున్న ఓటిటి షో అన్ స్టాప్పబుల్ లో. ఈ ఇద్దరి మధ్య ఓ క్రేజీ ఎపిసోడ్ ని ఇప్పుడు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది వచ్చే 4వ తేదీ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ మాత్రమే. ఇంకా ఇది ఎప్పుడు టెలికాస్ట్ కి వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఎలాగో షో తక్కువ ఎపిసోడ్లే కాబట్టి ఈ తక్కువ టైం లోనే చూడొచ్చు.