పాన్ ఇండియా సార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. పుష్ప సినిమా రికార్డుల గురించి కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సుకుమార్.
పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యుకేషన్, యాటిట్యూడ్ ఇవన్నీ తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. అప్పటివరకు తెలుగు, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ చేరువయ్యారు.
పుష్ప సినిమా ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే క్రికెటర్స్ రాజకీయ నాయకులు సినిమాల్లోని డైలాగులు తమదైన స్టైల్ లో చెబుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. పుష్ప 2 చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క గ్లిమ్స్ ను రీసెంట్గా రిలీజ్ చేసింది చిత్రం బృందం.
ఈ గ్లిమ్ప్స్ లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే “తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప” అని న్యూస్ వినిపిస్తుంది. ఆ తరువాత “అసలు పుష్ప ఎక్కడ” అని ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. 20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను ఆసక్తికరంగా కట్ చేసారు. ఈ గ్లిమ్ప్స్ పూర్తి వీడియోను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే కానుకగా ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకు రియలైజ్ చేయనున్నారు.
సినిమా: పుష్ప: ది రైజ్
తారాగణం: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు
సాంకేతిక బృందం:
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్ బండ్రెడ్డి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సినిమాటోగ్రాఫర్: Miresłow Kuba Brożek
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఎస్. రామకృష్ణ – మోనికా నిగోత్రే
గీత రచయిత: చంద్రబోస్
CEO: చెర్రీ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కెవివి బాల సుబ్రమణ్యం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – బాబా సాయికుమార్ మామిడపల్లి
బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్ ఇన్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్
పిఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, మేఘ శ్యామ్
మార్కెటింగ్ – ఫస్ట్ షో