ఫ్రెంచ్ కంపెనీనుంచి యుద్ద విమానాలను కొనుగోలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కుదిరిన రాఫేల్ డీల్ గురించిన కీలకయిన సాక్ష్యం బయటపడింది.
నిజానికి ఇలాంటి ఒప్పందాలను అంటే యుద్ధ విమానాలను కొనుగోలుచేసేందుకు జరిగే ఒప్పందాలను చేయాల్సింది రక్షణ శాఖ. ప్రధాని కార్యాలయం కాదు. అయితే, ప్రధాని మోదీ కార్యాలయం రక్షణ శాఖను అలా పక్కకు తన్నేసి, చర్చలను తన కంట్రోల్లోకి తీసుకుని కథంతా నడిపింది. రక్షణ శాఖ దీని మీద వ్యతిరేకత రాతపూర్వకంగా వ్యక్తం చేసింది.
7.87 బిలియన్ యూరోల విలువయిన ఈ ఒప్పందం పెద్ద కుంభకోణమని, అనిల్ అంబానీని ఈ బిజినెస్ లోకి దించి, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)ను ముంచారని డీల్ మీద వచ్చిన ప్రధాన అరోపణ.
ఈ కధనంతా ప్రధాని మోదీ దగ్గరుండి చర్చ లు జరిపి అనిల్ అంబానీకి భారీగా లాభం వచ్చేాలా చేశారని మోదీ మీద వచ్చిన ఆరోపణ.
రక్షణ శాఖ జరపాల్సిన చర్చలను ప్రధాని కార్యాలయం జరపడం ఏమిటి?
అంత వరకు సాగుతూ వచ్చిన రక్షణ శాఖ చర్చలేమయ్యాయి, చర్చలను ప్రధాని కార్యాలయం తన చేతుల్లోకి తీసుకోవడం మీద అప్పటి మంత్రి మనోహర్ పర్రికార్ ( ఇపుడు గోవా ముఖ్యమంత్రి) అధ్వర్యంలో రక్షణ శాఖ ఏమనింది? ప్రధాని జరపుతున్న చర్చలకు అమోదం తెలిపిందా లేక నిరసన తెలిపిందా?
ఈ ప్రశ్నలకు సమాధానం ఇంతవరకు దొరకలేదు.
అంతేకాదు, ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలు రాకముందే మనోహర్ పర్రికార్ ను గోవా ముఖ్యమంత్రిగా పంపించేశారు.
మొన్నా మధ్య రాఫేల్ డీల్ గురించి కీలకమయిన ఫైల్ ఒకటి మనోహర్ పర్రికార్ దగ్గిర ఉందని వార్త గుప్పుమంది. పర్రికార్ ఈ వార్తను ఖండించలేదు, అంగీకరించలేదు.
ప్రధాని ‘రాఫేల్ చర్చలు’ సాగిస్తున్నపుడు పర్రికార్ గాని, రక్షణ శాఖ అధికారులు గాని ఏమీ మాట్లాడలేదా కేవలం డ్రామా చూస్తూ ఉండిపోయారా? లేదు. వాళ్లు మూలన కూర్చోలేదు. ధైర్యంగా ప్రధాని కార్యాలయానికి లెటర్ రాసి, మీకు సంబంధంల ేదు, పక్కకు తప్పుకోండి, మా దారిలోకి రావద్దు ప్లీజ్ అని సలహా ఇచ్చారు.
విదేశాలతో చర్చలు జరిపేటపుడు ఆ బృందంలో ఎవరుండాలో ముందే నిర్ణయిస్తారు. ఇదే విధంగా రాఫేల్ తో చర్చలు జరిపే బృందమొకటి అప్పటికే తయారయింది. ప్రధాని కార్యాలయం ఈ బృందంలో సభ్యురాలు కాదు. అందువల్ల ఈ చర్చలు ఎలా సాగిస్తారని రక్షణ శాఖ చాలా స్పష్టంగా పిఎం వో కు రాసింది.
“we may advise PMO that any Officers who are not part of Indian Negotiating Team may refrain from having parallel parlays [parleys] with the officers of French Government,” it suggested that “in case the PMO is not confident about the outcome of negotiations being carried out by the MoD, a revised modality of negotiations to be led by PMO at appropriate level may be adopted in the case.”
ఇపుడు పిఎంవొకు రక్షణ శాఖ రాసిన ఈ నోట్ లు బయట పడ్డాయి. అత్యంత కీలకమయిన, ఇంతవరకు ఎవరికీ తెలియని ఈ డాక్యుమెంట్లు బయటపడటంతో రాఫేల్ గలాటా తీవ్రం కానుంది. ఎన్నికలు సమీపిస్తున్నపుడు వివాదం రాజుకుంటున్నది.
మద్రాసు నుంచి ప్రచురితమయ్యే The Hindu ఇంగ్లీష్ పత్రిక ఈ డాక్యుమెంట్ ను బయటపెట్టింది. రాఫేల్ తో యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ అధికారులు చర్చలు సాగిస్తున్నారని, అలాంటపుడు ప్రధాని కార్యాలయం కూడా సమాంతరంగా చర్చలు సాగించడం సరికాదని భారత రక్షణ శాఖ వ్యతిరేకత వ్యక్తం చేసింది.
ఈ మేరకు రక్షణ శాఖ ప్రధాని కార్యాలయానికి ఒక నోట్ కూడా పంపింది. అపుడు రక్షణ శాఖ మంత్రి పర్రికార్. పర్రికార్ కు తెలియకుండా ఈ నోటో పిఎంవొ కు వెళ్లదు. అంటే ప్రధాని సాగిస్తున్న చర్చల మీద మనోహన్ పర్రికార్ కు కూడా వ్యతిరేకత ఉందని అనుకోవాలి. ఇలాంటి చర్చలు భారత్ ప్రయోజనాలకు ముప్పుఅని, దీనిని ఫ్రెంచ్ పక్షం ఆసరా చేసుకుని ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తుందని హెచ్చరించింది.
ఫ్రెంచ్ కంపెనీ రాఫేల్ తో ప్రధాని (పిఎంవొ) సాగిస్తున్న చర్చలు మీద నాటి రక్షణ శాఖ కార్యదర్శి నవంబర్ 24,2015న గట్టిగా వ్యతిరేకత చూపారు. ఈ వ్యతిరేకత మీద డిప్యూటీ సెక్రెటరీ ఎస్ కె శర్మ (ఎయిర్- II) ఒక నోట్ తయారు చేశారు. దీనిని జాయింట్ సెక్రటెరీ అండ్ అక్విజిషన్ మేనేజర్ (ఎయిర్ ), డైరెక్టర్ జనరల్ (అక్విజిషన్) లు ఆమోదించారు.
ఈ నోట్ లో ఏమిరాశారు:
ఈ చర్చలలో నుంచి ప్రధాని కార్యాలయం వైదొలగాలని వారు సలహా ఇచ్చారు.
ఈ నోట్ మీద అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి జి మోహన్ కుమార్ చాలా స్ఫష్టంగా, ‘ప్రధాని కార్యాలయం ఇలాంటి చర్చలు జరిపి రక్షణ శాఖ ను దెబ్బతీయవద్దు,’ అని రాశారు.
“RM may pl. see. It is desirable that such discussions be avoided by the PMO as it undermines out negotiating position seriously.”
ప్రధాని కార్యాలయానికి రక్షణ శాఖ రాసిన నోట్ లో చాలా కఠినంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
“Such parallel negotiations may be detrimental to our interests as the French side may take advantage of same by interpreting such discussions to their benefit and weakening the position taken by Indian Negotiating Team. This has precisely happened in this case,” అని నోట్ లో రక్షణ శాఖ అభిప్రాయ పడింది.
అంటే దీనర్థం ఏమిటి. రక్షణ శాఖ అంతవరకు జరిపిన చర్చలను పక్కన పడేసి ప్రధాని మోదీ రంగంలోకి దిగి కొత్త గా చర్చలు ప్రారంభించి ఒప్పందం కుదుర్చుుకున్నారు అనేగా. ఇలా ప్రధాన మంత్రి కార్యాలయం బాహాటంగా దేశాల మధ్య జరిగే కొనుగోళ్ల లో తలదూర్చడం ఇదే మొదటి సారేమో. ప్రధాని కార్యాలయం, అక్కడి అధికారులు ఇలాంటి టెక్నికల్ డీల్స్ లోకి తల దూర్చరు.
అంతేకాదు, ప్రధాని కార్యాలయం రక్షణ శాఖకు తెలియపర్చకుండా సమాంతర చర్చలు జరిపింది. ఈ విషయాన్ని నోట్ లో రక్షణ శాఖ స్పష్టంగా రాసింది. ప్రధాని కార్యాలయం ఫ్రెంచ్ పక్షంతోసాగిస్తున్న చర్చల గురించి తానుగా రక్షణ శాఖ కు తెలియపర్చలేదు. ఈ విషయాన్ని రక్షణ శాఖకు చెప్పింది ఫ్రెంచ్ ప్రతినిధి బృందం నాయకుడు జనరల్ స్టీఫెన్ రెబ్. ఆయన 2015 అక్టోబర్ 3 న ఈ విషయాన్ని రక్షణ దృష్టికి తీసుకువచ్చారు. అంటే మనోహర్ పర్రికార్ నేతృత్వంలోని రక్షణ శాఖను ఈ చర్చల్లో విస్మరించారన్న మాట.
ఈ ఫ్రెంచ్ పెద్ద మనిషి రక్షణ శాఖ కు పంపిన లెటర్ లో చాలా ఆసక్తికరమయిన విషయాలు వెల్లడయ్యాయి. వాటిని రక్షణ శాఖ ఇలా పిఎం వొ కు గుర్తు చేసింది:
The letter “made mention of a telephonic conversation between Shri Jawed Ashraf, Joint Secretary in the Prime Minister’s Office and Mr. Luis Vassy, Diplomatic Adviser to the French Minister of Defence, which took place on 20.10.2015.”
అంటే రక్షణ శాఖ కు తెలియకుండా ఎపుడో ప్రధాని కార్యాలయం అధికారి జావేద్ అన్సారి ఫ్రెంచ్ వాళ్లలో చర్చలు మొదలు పెట్టారన్న మాట. ఇది చా లా తీవ్రమయిన విషయం. ప్రధాని మోదీ కార్యాలయం అధికారులు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.