ప్రధాని మోదీని బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఖ్యమంత్రి

ప్రధాని మోదీని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసి ప్రయోజనం పొందగలరా?  ఒక ముఖ్యమంత్రి ఇలా ప్రధాని మోదీని బ్లాక్ మెయిల్ చేసి పదవిలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అంటున్నారు. ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు, గోవా ను పాలిస్తున్నబిజెపి ముఖ్యమంత్రి మనోహర్ పర్రికాార్.

గోవాలో కాంగ్రెస్ జన ఆక్రోష్ ర్యాలీలో మాట్లాడుతూ జైపాల్ రెడ్డి ఈ విషయం వెల్లడించారు. పర్రికార్ పాంక్రియాటిక్ క్యాన్సర్ బాధ పడుతున్నారు. ఒక ఏడాదిగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్స ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. ఎందుకంటే, క్యాన్సర్ చికిత్స చాలా కాలం సాగుతూ ఉంటుంది. ఆయన అమెరికా లో చికిత్స చేయించుకున్నారు. లండన్ లో చికిత్స చేయించుకున్నారు. ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కూడా చికిత్స చేయించుకుంటున్నారు.అక్టోబర్ నుంచి ఆయన ఎక్కడా కనిపించడమే లేదు.  దాదాపు ఒక ఏడాదిగా ఆయన సీటులో కూర్చున్నది లేదు. దీనితో పాలన కుంటువడిందని, పార్ట్ టైం చీఫ్ మినిస్టర్ వద్దు, ఫుల్ టైం సిఎం కావాలని అక్కడి రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.  పర్రికార్ వద్దని గోవా రాష్ట్రమంతా కాంగ్రెస్ ఉద్యమాలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా  ఏర్రాటు చేసిన ఒక సభలో జైపాల్ ప్రసంగించి మోదీని పర్రికార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. ఎలా?

పర్రికార్ గతంలో రక్షణ మంత్రిగా ఉన్నారు. అపుడే రాఫేల్ ఒప్పందం ప్రధాని కుదుర్చుకున్నారు.  అయితే, ఈ విషయాన్ని రక్షణ మంత్రికి చెప్పనే లేదు. అయితే, ప్రధానికి అంగీకరించారు కాబట్టి నేను కూడా అంగీకరిస్తున్నాను అని ప్రకటన చేశారు. ఇలాంటపుడు రక్షణ మంత్రికి చెప్పకుండా రాఫేల్ డీల్ కుదుర్చకున్నారని పర్రికార్ చెబితే కొంపలంటుకుంటాయి. అందుకే, జబ్బు తో విధులు నిర్వర్తించలేకపోతున్నా, పార్ట్ టైం సిఎం, ఫుల్ టైం సిఎం కావాలని ఆందోళన సాగుతున్న ప్రధాని చర్య తీసుకోవడం లేదని జైపాల్ రెడ్డి అన్నారు.