Home News ఘోర ప్ర‌మాదం..23 మంది కూలీలు స్పాట్ డెడ్

ఘోర ప్ర‌మాదం..23 మంది కూలీలు స్పాట్ డెడ్

లాక్ డౌన్ తో వ‌ల‌స కూలీల బ్ర‌తుకులు చిద్ర‌మైపోతున్నాయి. రైళ్లు కింద‌…బ‌స్సులు కింద..ట్ర‌క్కుల కింద‌…ట్రాక్ట‌ర్ల కింద ప‌డి రోజూ మ‌ర‌ణ మ‌ర‌ణ వార్త వినాల్సిందే. రైలు ప‌ట్టాలు మీదు ప‌డుకున్న ఓ గూడ్స్ రైలు 14 మంది కూలీల‌ను పొట్ట‌నబెట్టుకుంది. ఆ ఘ‌ట‌న‌ మ‌రువ‌క ముందే ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో ప‌దుల సంఖ్య‌లో కార్మికులు విద్యుత్ షాక్ గురై మ‌ర‌ణించారు. వీరంతా ట్రాక్టర్ పై ప‌నికి వెళ్తోన్న స‌మ‌యంలో ట్రాక్ట‌ర్ అదుపు త‌ప్పి క‌రెంట్ స్థంబాన్ని ఢీ కొట్ట‌డంతో అక్క‌డిక్క‌డే ప్రాణాలు వ‌దిలారు. ఆ ఘ‌ట‌న‌లు మ‌రువ‌కే ముందే ఉత్త‌ప్ర‌దేశ్ లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది.

లాక్ డౌన్ నేప‌థ్యంలో వ‌ల‌స‌ కూలీల‌తో రాజాస్థాన్ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు వెళ్తోన్న ఓ ట్ర‌క్కు ను మ‌రో ట్ర‌క్కు ఢీ కొట్టింది. దీంతో 23 మంది వ‌ల‌స కార్మికులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వ‌దిలారు. మ‌రో 20 మందికి తీవ్రంగా గాయాల‌య్యాయి. ఔరియా జాతీయ ర‌హ‌దారిపై ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. వీరంతా ఉత్త‌ర ప్ర‌దేశ్ వాసులుగా పోలుసులు గుర్తించే కేసు న‌మోదు చేసి..ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న తో దేశమంతా ఉలిక్కి ప‌డింది. వ‌రుస ప్ర‌మాదాలు కూలీల‌కు కంటి మీద కునుక లేకుండా చేస్తున్నాయి. బ్ర‌తుకు జీవుడా అంటూ పొట్ట చేత ప‌టి కుటుంబాల‌కి ఎక్క‌డో దూరంగా ప‌నిచేస్తూ…చివ‌రికి గ‌మ్యం మ‌ధ్య‌లోనే అసువులు బాసుతున్నారు.

క‌రోనా వైర‌స్ చావుల‌క‌న్నా…యాక్సిడెంట్ కార‌ణంగా మృతి చెందిన వారు ఎక్కువ‌గా ఉన్న‌ట్లుంది. మ‌రి ఈ ప్ర‌మాదాల‌కి ప్ర‌భుత్వం ఎలాంటి బ‌ధులిస్తుంది? త‌గిన‌న్ని శ్రామిక్ రైళ్ల‌ను న‌డిపితే ఈ ప‌రిస్థితి వ‌చ్చేదా? అని ప్ర‌జ‌లు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఓ ప‌క్క జాతీయ ర‌హ‌దారుల వెంబ‌డి వ‌ల‌స కూలీలు నానా అవ‌స్థ‌లు ప‌డి న‌డుస్తున్నా..కేంద్ర-రాష్ర్ట ప్ర‌భుత్వాలు వైర‌స్ పేరు చెప్పి నిమ్మ‌కు నీరెత్త‌న‌ట్లే వ్య‌వ‌రిస్తోంది. లాక్ డౌన్ పేరుతో ప్ర‌భుత్వమే జ‌నాల్ని చంపేస్తుంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి.

- Advertisement -

Related Posts

విహార యాత్ర‌కు బ‌య‌లు దేరిన మ‌రో క్రేజీ క‌పుల్‌… వీరి ప్ర‌యాణం ఎక్క‌డికో?

ఎప్పుడు స‌రదాలు, సంతోషాల మ‌ధ్య హాయిగా ఉండే సెల‌బ్రిటీల‌కు క‌రోనా మ‌హమ్మారి పెద్ద అడ్డుక‌ట్ట వేసింది. క‌రోనాని అరిక‌ట్టే క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో దాదాపు ఎనిమిది నెల‌ల పాటు అంతా...

కుప్పంలో వైసీపీని చూసి పెద్దిరెడ్డి షాక్.. ఆయన ముందే గొడవలు ?

చంద్రబాబు నాయుడుకు అధికారం పోయిందనే బాధ ఒక ఎత్తైతే అంతకు మించిన బాధ ఇంకొకటి ఉంది.  అదే కుప్పంలో మెజారిటీ తగ్గడం.  30 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు గతంలో ఏనాడూ మెజారిటీ తగ్గిన దాఖలాలు లేవు. ...

కేటీఆర్ సీఎం అయితే పార్టీలో అణుబాంబు పేలుతుంది .. బండి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ  సీఎంగా మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది. సొంతపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కానున్నారని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ సీఎం అయితే...

పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న సంపూర్ణేష్‌.. ఊపిరి పీల్చుకున్న చిత్ర బృందం

ఒక‌ప్పుడు డూపుల‌తో స్టంట్స్ చేసే మ‌న హీరోలు ఇప్పుడు ఎవ‌రి సాయం అవ‌సరం లేద‌న్న‌ట్టు యాక్ష‌న్ సీన్స్‌లోకి బ‌రిలోకి దిగుతున్నారు. ఇటీవ‌ల అజిత్ ఓ యాక్ష‌న్ సీన్ లో భాగంగా పెద్ద ప్ర‌మాదం...

Latest News